Gautam Gambhir: అభిమానం లేదా హీరోయిజం అనేది సత్తా ఉంటేనే సాధ్యం. అందుకే విరాట్ కోహ్లీ, ధోని ఫ్యాన్స్..ఇప్పుడు గౌతమ్ గంభీర్‌పై విరుచుకుపడుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..
ఆటగాళ్లపై కామెంట్లు చేయడం మాజీ టీమ్ ఇండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు అలవాటే. ఒకరికి ప్రశంసలు లభిస్తుంటే బహుశా సహించలేని వ్యక్తిత్వమున్నట్టుంది. చాలా సందర్భాల్లో క్రికెట్ ఆటగాళ్లను విమర్శించిన పరిస్థితి. ఇప్పుడు మరోసారి విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోనిపై చేసిన విమర్శలు..తిప్పికొడుతున్నాయి. గౌతమ్ గంభీర్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
క్రికెట్‌లో హీరో వర్షిప్ గురించి గౌతమ్ గంభీర్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొన్న ధోని..ఇప్పుడు విరాట్ కోహ్లీ హీరో వర్షిప్ కారణంగా ఇతర స్టార్లు పైకి రాలేరంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు విరాట్, ధోని అభిమానుల్లో ఆగ్రహాన్ని పెంచాయి.
Gautam gambhir has problem with hero worshipping, and he was indirectly talking about players like him who doesn't get fandom like Virat kohli and MS Dhoni, my question is to him that why tf he doesn't become a hero so that he also can get worshipped like others.
— Vishnu 🕉 (@MasterVKohli) September 19, 2022
ధోని, కోహ్లికు ఉన్న క్రేజ్, ఆదరణ చూసి గౌతమ్ గంభీర్ జెలస్ ఫీలవుతున్నాడని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కీర్తి అనేది ఎవరికివారు తెచ్చుకోలేరని..సామర్ధ్యం ఒక్కటే కీర్తి సంపాదిస్తుందని ఇంకొందరు సూచిస్తున్నారు. జెలస్ ఫీలవద్దని కోరుతున్నారు.
@GautamGambhir is just slamming this hero worship shit regarding Virat Kohli and MS Dhoni cause he wasn’t worshipped during his tenure when he played a wonderful innings in the world cup final but the fact Dhoni played a wonderful match winning innings too was given an upper hand pic.twitter.com/KnYk8sRXvv
— Yash Sharma (@___yashhsharma) September 19, 2022
విరాట్ కోహ్లీ, ధోనిలకున్న క్రేజ్ తనకు లేకపోవడంతో ఈర్ష్యతో గౌతమ్ గంభీర్ ఇలా మాట్లాడుతున్నాడని కామెంట్ చేశారు.
Also read: Kavya Maran: వేలంలో 'తగ్గేదేలే' అన్న కావ్య మారన్.. యువ ఆటగాడిని పోటీపడి మరీ దక్కించుకుందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook