ఆస్ట్రేలియా గడ్డపై.. ఆస్ట్రేలియాపైనే మరో రికార్డును సొంతం చేసుకున్న విరాట్ కోహ్లి

ఆస్ట్రేలియా గడ్డపై వీవీఎస్ లక్ష్మణ్ రికార్డును అధిగమించిన విరాట్ కోహ్లి

Last Updated : Dec 9, 2018, 10:58 AM IST
ఆస్ట్రేలియా గడ్డపై.. ఆస్ట్రేలియాపైనే మరో రికార్డును సొంతం చేసుకున్న విరాట్ కోహ్లి

న్యూఢిల్లీ : ఏ సిరీస్ అయినా, ఏ ఫార్మాట్ అయినా.. ఏ గడ్డపైనైనా... రికార్డులు నావే అంటున్నాడు టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ. అవును, కోహ్లీకి రికార్డులు కొత్త కావు.. అతడు ఆడుతున్న ప్రతీ మ్యాచ్‌లోనూ ఏదో ఓ రికార్డు అతడి ఖాతాలో చేరిపోతోంది. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ కూడా చేరిపోయాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సొంతం చేసుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, వెరీ వెరీ స్టైలిష్ బ్యాట్స్ మేన్ వీవీఎస్ లక్ష్మణ్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ వంటి దిగ్గజ క్రికెటర్లు ఉండగా ఆ తర్వాత నాలుగో స్థానాన్ని కోహ్లీ కైవసం చేసుకున్నాడు. ఆసీస్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా శనివారం నాడు ఆడిలైడ్ స్టేడియంలో విరాట్ కోహ్లీ ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. 31వ ఓవర్లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ వేసిన మూడో బంతిని స్వేర్‌లెగ్ ఆడి సింగిల్ తీయడం ద్వారా విరాట్ కోహ్లీ ఈ రికార్డును పూర్తిచేశాడు. 

ఇప్పటివరకు ఈ రికార్డు సొంతం చేసుకున్న ఆటగాళ్లు ముగ్గురు వున్నా.. అందరికన్నా వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా మాత్రం కోహ్లీనే నిలవడం విశేషం. 

Trending News