IND vs WI: రెచ్చిపోయిన అక్షర్ పటేల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం! విండీస్‌పై సిరీస్‌ కైవసం

WI vs IND, India beat West Indies on 2nd ODI and seals series win. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (64 నాటౌట్‌) రెచ్చిపోవడంతో.. భారత్‌ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 25, 2022, 09:29 AM IST
  • రెచ్చిపోయిన అక్షర్ పటేల్
  • ఉత్కంఠ పోరులో భారత్ విజయం
  • విండీస్‌పై సిరీస్‌ కైవసం
IND vs WI: రెచ్చిపోయిన అక్షర్ పటేల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం! విండీస్‌పై సిరీస్‌ కైవసం

India beat West Indies on 2nd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ అద్భుత విజయం సాధించింది. ఇన్నింగ్స్ చివరలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (64 నాటౌట్‌; 35 బంతుల్లో 3x4, 5x6) రెచ్చిపోవడంతో.. భారత్‌ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. 312 పరుగుల లక్ష్యాన్ని గబ్బర్ సేన 2 బంతులు మిగిలుండగానే 8 వికెట్లు కోల్పోయి చేధించింది. యువ బ్యాటర్లు శ్రేయస్‌ అయ్యర్‌ (63; 71 బంతుల్లో 4x4, 1x6), సంజూ శాంసన్‌ (54; 51 బంతుల్లో 3x4,  3x6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో భారత్ 2-0తో ఒన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

భారీ ఛేదనకు దిగిన భారత్‌కు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (13; 31 బంతుల్లో)‌, శుభ్‌మన్‌ గిల్‌ (43; 49 బంతుల్లో 5x4) ఆరంభంలో ఆచితూచి ఆడారు. ముఖ్యంగా గబ్బర్ నెమ్మదిగా ఆడాడు. 11వ ఓవర్‌లో ధావన్‌ను షెపర్డ్‌ ఔట్‌ ఔట్ చేశాడు. కాసేపటికే మేయర్స్‌ వేసిన అద్భుత బంతికి గిల్‌ కాట్‌ అండ్‌ బౌల్ అయ్యాడు. ఆపై సూర్యకుమార్‌ కుమార్ యాదవ్ (9)ను కూడా మేయర్స్‌ అవుట్ చేశాడు. దీంతో భారత్‌ 79 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. క్రీజులో కుదురుకున్నాక స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.  ఈ క్రమంలోనే నాలుగో వికెట్‌కు 99 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 

అయితే శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌ జోడీని అల్‌జారీ జోసెఫ్‌ విడదీశాడు. 33వ ఓవర్‌ చివరి బంతికి అయ్యర్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దీపక్‌ హుడా (33; 36 బంతుల్లో 2x4) సంజూతో కలిసి విలువైన రన్స్ చేశాడు. అయితే కీలక సమయంలో సంజూ పెవిలియన్‌ చేరడంతో.. భారత్ ఆశలు సన్నగిల్లాయి. ఈ సమయంలో అక్షర్‌ పటేల్‌ ధాటిగా ఆడుతూ విజయంపై  ఆశలు రేపారు. దీపక్‌ ఔట్ అయినా శార్దూల్‌ ఠాకూర్ (3), అవేశ్‌ ఖాన్‌ (10)తో కలిసి మ్యాచును అక్షర్‌ చివరి ఓవర్ వరకు తెచ్చాడు. చివరి ఓవర్లో 8 రన్స్ చేయాల్సి ఉండగా.. నాలుగో బంతికి సిక్స్ బాది జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. విండీస్‌ బౌలర్లలో అల్‌జారీ, మేయర్స్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

ఈ మ్యాచులో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఓపెనర్‌ షై హోప్‌ (115; 135 బంతుల్లో 8x4, 3x6) సెంచరీతో చెలరేగాడు. కైల్‌ మేయర్స్‌ (39; 23 బంతుల్లో 6x4, 1x6), బ్రూక్స్‌ (35; 36 బంతుల్లో 5x4), నికోలస్‌ పూరన్‌ (74; 77 బంతుల్లో 1x4, 6x6) రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. కెరీర్‌లో 100వ వన్డేలో సెంచరీ సాధించిన పదో క్రికెటర్‌గా హోప్‌ గుర్తింపు పొందాడు. అక్షర్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. చివరి వన్డే బుధవారం జరగనుంది. 

Also Read: కళ్లకు కాటుక పెట్టి.. నాభి అందాలతో పైకెప్పిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి వైద్య!

Also Read: Horoscope Today July 25 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఊహించని శుభవార్త వింటారు!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News