Yashpal Sharma Dies: భారత క్రికెట్లో విషాదం చోటుచేసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మ కన్నుమూశారు. గుండెపోటు రావడంతో నేటి ఉదయం ఈ మాజీ క్రికెటర్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారని న్యూస్ ఏజెన్సీ పీటీఐ రిపోర్ట్ చేసింది.
1983లో టీమిండియా వన్డే ప్రపంచ కప్ సాధించిన జట్టులో యశ్పాల్ శర్మ ఒకరు. 1970 దశకం చివర్లో, 80 దశకంలో భారత జట్టుకు పలు అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించారు. మిడిలార్డర్లో జట్టుకు వెన్నెముకకు ఉండే పాత్ర పోషించాడు. Team India వరల్డ్ కప్ విజేత మరణం పట్ల మాజీ క్రికెటర్లు, నేటి తరం క్రికెటర్లు సంతాపం ప్రకటిస్తున్నారు. శర్మ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. పంజాబ్ మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మ ఆగస్టు 11, 1954లో లుధియానాలో జన్మించారు.
Also Read: Australia vs West Indies: టీ20ల్లో యూనివర్సల్ బాస్ Chris Gayle అరుదైన ఘనత
Devastating news of the passing of Yash Paaji. He was one of the hero’s of 1983 World Cup winning team and was a very affable person. Heartfelt condolences to the family. Thoughts and Prayers. Om Shanti🙏 pic.twitter.com/k4EB3fz0fU
— VVS Laxman (@VVSLaxman281) July 13, 2021
1979లో ఇంగ్లాండ్ జట్టుతో మ్యాచ్ ద్వారా టీమిండియాకు శర్మ అరంగేట్రం చేశారు. 37 టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన యశ్పాల్ శర్మ రెండు శతకాలు, 9 అర్ధ శతకాల సాయంతో 1,606 పరుగులు సాధించారు. అతడి బ్యాటింగ్ సగటు 33. వరల్డ్ కప్ 1983 సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుపై చేసిన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ అద్భుతం. 2000 సంవత్సరంలో టీమిండియా జాతీయ జట్టుకు సెలక్టర్‌గా సేవలు అంధించారు. మాజీ క్రికెటర్ యశ్‌పాల్‌కు భార్య, ఇద్దరు కమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
Also Read: Suresh Raina on Virat Kohli: ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా నెగ్గలేదు, సురేష్ రైనా కామెంట్స్ వైరల్
సహచర ఆటగాడు యశ్పాల్ శర్మ మరణంపై టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman), పలువురు మాజీ క్రికెటర్లు, కేంద్ర మంత్రులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇటీవల కొన్ని వారాల కిందట ఓ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో శర్మను కలిశానని వెంగ్ సర్కార్ గుర్తుచేసుకున్నాడు. కానీ అంతలోనే శర్మ అకాల మరణం చెందుతాడని ఊహించలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ సైతం వన్డే వరల్డ్ కప్ జట్టులో సభ్యుడైన శర్మ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook