కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-2021 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇవాళ లోక్ సభలో సరిగ్గా 11 గంటలకు ప్రారంభమైన ఆమె బడ్జెట్ ప్రసంగం 2 గంటల 19 నిముషాలు సాగింది. నిజానికి ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని 90 నిముషాల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఆమె బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ 2020-2021 పై కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర బడ్జెట్ చాలా పేలవంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో పెద్దగా చమక్కులు ఏమీ లేవన్నారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన 2020-2021 ఆర్ధిక సంవత్సర బడ్జెట్.. స్టాక్ మార్కెట్ ను నిరుత్సాహం నింపింది. బడ్జెట్ పై ఎన్నో ఆశలు, ఉత్సాహంతో ఉదయం స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి.
కేంద్ర బడ్జెట్ 2020-2021 ఉద్యోగులకు, చిన్న వ్యాపారాస్తులకు ఆశాజనకంగా నిలిచింది. ముందుగా ఊహించిన విధంగానే ఆదాయపు పన్ను శాతంలో భారీగా కాకపోయినా. . కొంత మేర లాభం కనిపించింది. ఆదాయపు పన్ను శాతాన్ని కాస్త తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-2021 సంవత్సరానికి గానూ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సబ్ కా సాథ్ .. సబ్ కా వికాస్ .. సబ్ కా విశ్వాస్ నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆమె తెలిపారు. అంత్యోదయులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ను రూపొందించామని నిర్మలా సీతారామన్ చెప్పుకున్నారు. ప్రభుత్వం నుంచి నేరుగా ప్రతిఫలాలు పేదలకు అందినప్పుడే సంక్షేమ పథకాలకు అర్థం ఉంటుందన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో పర్యాయం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్ర బడ్జెట్ 2020లో ఈ అంశాలపై ప్రకటన ఉంటుందని సామాన్యులు ఆశిస్తున్నారు.
Bank strike On January 31: తమ డిమాండ్లను నెరవేర్చలేదని బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. రెండు రోజుల పాటు బ్యాంకుల బంద్కు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. తద్వారా మూడు రోజుల పాటు బ్యాంక్ సర్వీసులు అందుబాటులో ఉండవు.
Union Budget 2020 | దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం దగ్గరకొచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.