SVSN Varma: పవన్‌ కల్యాణ్‌‌ పోస్టుకు 'పిఠాపురం గండం'.. నారా లోకేశ్‌కు ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ జై!

Big Shock To Pawan Kalyan SVSN Varma Supports To Nara Lokesh As Deputy CM: పిఠాపురం నుంచే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పదవికి గండం ఏర్పడింది. నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదనకు పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ మద్దతు ప్రకటించడం సంచలనం రేపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 19, 2025, 08:38 PM IST
SVSN Varma: పవన్‌ కల్యాణ్‌‌ పోస్టుకు 'పిఠాపురం గండం'.. నారా లోకేశ్‌కు ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ జై!

SVSN Varma vs Pawan Kalyan: సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచే ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పోస్టుకు ఎసరు పడుతోంది. పవన్‌ పోస్టు ఊస్టింగ్‌ కోసం పిఠాపురం నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతుండడం ఏపీలో కలకలం రేపుతున్నాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ దూకుడును తగ్గించేందుకు సరికొత్తగా నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలనే ప్రతిపాదనకు పిఠాపురం నియోజకవర్గం కూడా జై కొట్టింది. డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్‌కే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ మద్దతు ప్రకటించారు. వర్మ చేసిన ప్రకటన పిఠాపురం రాజకీయాలను మార్చేసేట్టు కనిపిస్తున్నాయి.

Also Read: Amit Shah: అంబేడ్కర్‌ వ్యాఖ్యల చిచ్చు.. ఆంధ్రప్రదేశ్‌లో అమిత్‌ షాకు ఘోర పరాభవం

ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేశ్‌కు అవకాశం ఇవ్వాల్సిందేనని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వ‌ర్మ డిమాండ్ చేశారు. ఇది త‌న ఒక‌రి కోరిక మాత్రమే కాద‌ని.. యావ‌త్తు కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నార‌ని ప్రకటించి సంచలనం రేపారు. రాష్ట్రవ్యాప్తంగా లోకేశ్‌ పదవిపై జరుగుతున్న చర్చపై ఆదివారం పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో వర్మ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Tirumala: తిరుమలలో మరో వివాదం.. వైకుంఠ ద్వార పుష్పాలంకరణపై రచ్చ

నారా లోకేశ్‌కి డిప్యూటీ సీఎం ప‌ద‌వి క‌ట్ట‌బెడితే త‌ప్పేమిటి అని మీడియాను వర్మ ఎదురు ప్రశ్నించారు . 'ఆయా పార్టీ కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాలు వారికి ఉంటాయి. వాటిని గౌర‌వించుకోవాల్సిన బాధ్య‌త ఆ పార్టీల‌కు ఉంటుంది' అని పేర్కొన్నారు. 'ఐదు మంది.. పది మంది ఉన్న పార్టీ మాది కాదు. కోటి సభ్యత్వాలు చేర్చడానికి ముఖ్య‌ కార‌కుడు నారా లోకేశ్‌. ఇది ప్ర‌తీ టిడిపి కార్య‌క‌ర్త మాట‌' అని వ‌ర్మ చెప్పుకొచ్చారు.

'కొన్ని ప్రాంతాల నుంచి నాయ‌కులు లోకేశ్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాల‌ని కోరుతున్నారు. దీనికి నా మ‌ద్ధ‌తు కూడా ఉంటుంది' అ‌ని ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ప్రకటించారు. 'గ‌తంలో టీడీపీ శకం ముగిసింద‌న్నే ప్ర‌చారం నుంచి.. ప్ర‌తీ కార్య‌క‌ర్త‌కు జోష్ నింపిన ఘ‌న‌త లోకేశ్‌ది' అని వివరించారు. 'యువ‌గ‌ళం పేరుతో 3 వేల కిలోమీట‌ర్ల దూరం న‌డిచి పార్టీ గెలుపునకు.. ప్రజ‌ల‌కు భ‌రోసాతోపాటు, కార్య‌క‌ర్త‌ల‌కు  ధైర్యాన్ని ఇచ్చిన ఏకైక నాయ‌కుడు లోకేశ్‌' అని వ‌ర్మ ప్రశంసలు కురిపించారు. 'రాబోయే కాలంలో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్య‌త లోకేశ్‌పై ఉంది. చంద్ర‌బాబు త‌ర్వాత త‌రం నాయ‌కుడు లోకేశ్‌ అని.. దీనిపై ఎలాంటి అపోహాలు, వ‌క్ర‌భాష్యాల‌కు పోవ‌ద్దు. ఇది టీడీపీ కార్య‌కర్త‌లుగా మేమంతా కోరుకుంటున్నాం' అని వ‌ర్మ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

Trending News