ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్నారై తెలుగు సంఘాలు సంయుక్తంగా నిర్మించడానికి సిద్ధమైన ప్రతిష్టాత్మక ఐకానిక్ టవర్ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు గురువారం విచ్చేశారు
చతుర్థ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ కార్యకర్తలు, మంత్రులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలికి నివాళులు అర్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఏం చేసిందో.. భవిష్యత్తులో ఏం చేయబోతుందో తెలియజేసే అవగాహన కార్యక్రమాలకు తాము నాంది పలుకుతున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చెందిన ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ ఒక ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ ఏజెన్సీకి ఆయన సంవత్సరానికి రూ.6 కోట్లు చెల్లిస్తున్నారని పలు ప్రముఖ పత్రికల్లో వార్తలు రావడం గమనార్హం
ఇరు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తూ ఒకరు ఓటుకు నోటు కేసు గురించి ఆలోచిస్తుంటే.. మరొకరు ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి ఆలోచిస్తున్నారని.. ఈ క్రమంలో ప్రజల సమస్యలను పట్టించుకోవడం మానేశారని సీపీఎం జాతీయ కార్యదర్శి నారాయణ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు
టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా గత ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే బీజేపీ కచ్చితంగా 20 ఎమ్మెల్యే సీట్లు, 10 ఎంపీలు స్థానాలు గెలిచేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు.
భావికాలంలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహిస్తే.. దానికి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తుందని.. ఏపీ రాజధాని అమరావతిలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించడం తథ్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం చూడాలని ఆశగా వచ్చిన ఆ భక్తులకు మరణదేవత ద్వారాలు తెరిచింది. సీతమ్మ పెళ్లి వేడుకలను చూడాలని వచ్చిన ఆ అభాగ్యుల కుటుంబాలకు మాత్రం
ఆమె కళ్యాణం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.