ఒక రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీలు వేరే ఇతర రాష్ట్రాల్లో ఒకవేళ తమ కులాన్ని నోటిఫై చేయలేకపోతే వారు ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్ పొందలేరని సుప్రీంకోర్టు తెలిపింది.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయలేమని కేంద్ర ప్రభుత్వం మళ్లీ స్పష్టం చేసింది.ఇదే విషయం మార్చి 12న జరిగిన రైల్వే అధికారుల రివ్యూ మీటింగులో చెప్పామని కూడా కేంద్రం ప్రకటించింది.
జాతీయ స్థాయిలో దేశంలోని ప్రముఖ లా కాలేజీలలో ప్రవేశానికి గాను నిర్వహించే పరీక్ష క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్టు) ఫలితాలను గురువారం అధికారికంగా అధికారులు విడుదల చేశారు.
కర్ణాటక రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ నిరూపించుకొని సీఎం కుర్చీలో శాశ్వతంగా ఉండాలని ఇరు పార్టీలు భావిస్తున్న వేళ.. కొత్త సీఎం యడ్యూరప్ప సరికొత్త నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
కర్ణాటక రాజకీయాలలో రెండు మూడు రోజులుగా అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమస్య రేపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సీఎంగా యడ్యూరప్ప చేసిన ప్రమాణ స్వీకారాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాయి.
ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న కట్టడం తాజ్మహల్. అటువంటి తాజ్ మహల్ రంగు వెలిసిపోయి రోజు రోజుకీ అందవిహీనంగా మారుతుందని.. పురాతన కట్టడాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుందని.. ఈ విషయంపై వెంటనే వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
'ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్' కింద తక్షణ అరెస్టులు వద్దంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అపట్ల దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు ఏప్రిల్ 1న పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. అలాగే తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2న దేశవ్యాప్త బంద్, రహదారుల దిగ్బంధనం చేపట్టాలని నిర్ణయించాయి.
భారత పౌరుల ఆధార్ సంఖ్యలను కొందరు ప్రైవేటు ఆపరేటర్లు సేకరించి అధిక మొత్తానికి వేరే ఏజెన్సీలకు అమ్ముకుంటున్నారని వార్తలు వస్తున్న క్రమంలో అదే అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.