sahara group సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సహారా గ్రూపునకు చెందిన 9 సంస్థలపై ఎస్ఎఫ్ఐఓ విచారణను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో పాటుగా సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ తో పాటు ఆయన సంస్థలకు చెందిన ఉన్నతోద్యోగులపై లుక్అవుట్ సర్క్యులర్లతో పాటు ఇతర చర్యలు తీసుకునేందుకు కూడా సుప్రీం కోర్టు వీలు కల్పించింది. సుబ్రతోరాయ్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
ఏపీ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ అందుకు ఒప్పుకోలేదు. ఏపీ ప్రభుత్వ అభ్యర్థన (English Medium In AP Schools)ను తోసిపుచ్చింది.
టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వానికి (DoT) చెల్లించాల్సిన బకాయిలపై సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త డెడ్‌లైన్ విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. పదేళ్లలో ఏజీఆర్ (Adjusted Gross Revenue) బకాయిలను చెల్లించాలని పలు షరతులతో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు కోర్టు ధిక్కారం కేసులో కేవలం ఒక్క రూపాయి జరిమానా (Prashant Bhushan Fined For RS 1) విధించారు. ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లుగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చింది.
కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా పలు రాష్ట్రాలు డిగ్రీ పరీక్షలను రద్దు చేస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు ( Supreme Court )కీలక వ్యాఖ్యలు చేసింది. చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పాస్ చేయటం నిబంధనలకు విరుద్ధమని సుప్రీం పేర్కొంది.
అయోధ్య ( Ayodhya ) లో రామమందిర నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో బాబ్రీ కూల్చివేత కేసు కూడా చివరి దశకు చేరుకుంది. వాస్తవానికి బాబ్రీ విధ్వంసం కేసులో ఆగస్టు 31 నాటికీ తీర్పును వెలువరించాలని సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court of India ) అంతకుముందే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ( cbi special court ) ఆదేశించిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant death case) అనుమానాస్పద మృతి కేసులో సుప్రీంకోర్టు ( supreme court ) కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్ ముఖ్యమంత్రి వినతి మేరకు ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకీ అప్పగించిన విషయం మనందరికీ తెలిసిందే.
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టులో విచారణ సరిగానే జరిగిందని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే (CJI SA Bobde) తన సెన్సాఫ్ హ్యూమర్ ప్రదర్శించారు. తన ప్రశ్నతో ఖైదీని ఇరుకునపెట్టే యత్నం చేశారు.
ఆస్తిలో కేవలం కుమారులకే హక్కు ఉందని భావిస్తుంటారు. మహిళలకు ఆస్తి హక్కు చెందుతుందా (Daughters Have right over Parental Property) అనే విషయంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది
ఆటగాడిగా, కెప్టెన్‌గా విశేష సేవలందించిన సౌరవ్ గంగూలీ (Sourav Ganguly).. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడి (BCCI President)గా కీలక పదవిని సైతం అలంకరించాడు.
రాజస్థాన్ రాజకీయ సంక్షోభాన్ని ఈ విధానంలో ఎదుర్కోలేమని భావించిన సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెనక్కి తగ్గింది. స్పీకర్ సీపీ జోషి (Rajasthan Assembly Speaker CP Joshi) తన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ఉపసంహరించుకున్నారు.
నిర్భయ కేసులో దోషి పవన్ కుమార్ గుప్తా చేసిన చివరి ప్రయత్నం విఫలమైంది. నిర్భయపై గ్యాంగ్ రేప్ చేసిన సమయంతో తాను మైనర్ అని, జువైనల్‌గా శిక్ష ఖరారు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
భారత ప్రధాని న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ నియమితులయ్యారు. ప్రస్తుత న్యాయమూర్తి దీపక్ మిశ్రా పదవీ కాలం గడుస్తున్నందున.. అక్టోబర్ 3 2018 తేది నుండి గొగోయ్ ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.