బీజేపీ నేత మనీష్ గ్రోవర్‌ను ఎవరైనా అడ్డుకుంటే.. వారి కళ్లు పీకేస్తా... చేతులు నరికేస్తా... అంటూ ఆ పార్టీ ఎంపీ అరవింద్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Rythu bandhu scheme money in bank accounts: హైదరాబాద్: రైతుబంధు నిధులను పాత బకాయిల కింద సర్దుబాటు చేస్తున్న కొన్ని బ్యాంకులు.. ఆ మొత్తాన్ని విత్ డ్రా చేయడానికి అంగీకరించడం లేదని తమ దృష్టికి వచ్చిందని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు.
MSP for Kharif crops hiked, price list of crops: న్యూ ఢిల్లీ: ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ పంటలకు కనీస మద్ధతు ధరలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ మీడియాకు వెల్లడించారు.
Telangana: 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రైతులకు కనిష్ట మద్దతు ధర అందించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ.7500 కోట్ల మేరా నష్టం ఏర్పడినట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇందులో కేవలం వరి కొనుగోలు వల్లే సుమారు రూ.3,935 కోట్ల మేరా నష్టం వాటల్లినట్టు తెలిపింది ప్రభుత్వం.
బీజేపీ (BJP) కి చిరకాల మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ షాక్ ఇచ్చింది. అధికార పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి తప్పుకుంటున్నట్లు అకాలీదళ్ (SHIROMANI AKALI DAL) ప్రకటించింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు కొన్ని రోజుల నుంచి గళం వినిపిస్తున్నారు. ఆ బిల్లులను నిరసిస్తూ.. అకాలీదళ్ పార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ (Harsimrat Kaur Badal) కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
మూడు రోజుల నుంచి వ్యవసాయ బిల్లులపై పార్లమెంట్ (Parliament) అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ సభలో విపక్షపార్టీల సభ్యులు ఆందోళన నిర్వహించి డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై అనుచితంగా ప్రవర్తించారు.
Rythu bandhu scheme money | హైదరాబాద్: రైతు బంధు పథకం కింద రైతులకు అందించే పెట్టుబడి సాయం రాష్ట్రంలోని రైతులు అందరికి అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
నేనూ ఒక రైతునే.. అందుకే రైతుగా చెబుతున్నాను.. ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తే ప్రతిరైతు తప్పకండా రాజవుతాడంటూ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే.. దానికి తోడు ఇటీవల తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు రైతులను ఇంకొంత నష్టపరిచాయని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఓవైపు తెలంగాణలో రైతులు ఇలా నానా ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు తెలంగాణ సర్కార్ మాత్రం రైతుల అవస్థలను పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కర్రపెండలం పంటకు జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని, వర్షాధారంతో పాటు ఆరుతడి ద్వారా కర్రపెండలం సాగు చేయడంతో పాటు అధిక దిగుబడులు రాబట్టొచ్చునని మంత్రి తెలిపారు. కర్రపెండలం నుండి సాపుదనా (సగ్గుబియ్యం), గంజిపొడి, చిప్స్ తయారీ, లాంటి దాదాపు 18 రకాల వస్తువుల తయారీకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వస్త్ర పరిశ్రమలోనూ కర్రపెండలం వినియోగిస్తుండటంతో ఈ పంటకు ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండ్ ఉంది.
Union Budget 2020 । మహిళల సాధికారత కోసం ప్రధాని మోదీ సర్కార్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ధాన్యలక్ష్మీ అనే స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలకు బాధ్యతలు అప్పగించింది.
Union budget 2020 for agriculture: రైతులకు నాబార్డు స్కీమ్ వర్తింపచేస్తామని, రైతుల కోసం కృషి ఉడాన్ పథకం తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.