AP Politics: ఆ జిల్లాలో రాజకీయాలన్నీ పరమశివుడే చుట్టే తిరుగుతున్నాయి..! అధికారంలోకి రావడమే ఆలస్యం అన్నట్టు.. అక్కడి నేతలంతా.. ఆ గుడినే ఆదాయ వనరుగా మార్చేసుకుంటున్నారు. అధికారంలో ఉండగానే నాలుగురాళ్లు వెనకేసుకోవాలని అనుకుంటున్నారట. ఇంతలా రాజకీయాల్లోకి బోలా శంకరుడిని వాడుకుని క్యాష్ చేసుకుంటున్న నియోజకవర్గం ఏంటి.. ఆ నేతలెవరు..!
AP POLITICS: ఎమ్మెల్యేగా హ్యట్రిక్ నమోదు చేశారు ఆ ఎమ్మెల్యే. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రమంత్రిగానూ సేవలందించారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడంతో తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. అప్పటినుంచి సైకిల్ పార్టీలో కీలపాత్ర పోషిస్తూ చినబాబుకు మరింత దగ్గరయ్యారు. కానీ అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉందన్న చందంగా ఆయనకు మాత్రం అమాత్యాయోగం మళ్లీ వరించలేదు. అందుకే ఎవరికి చెప్పుకోలేక.. అటు మింగలేక ఇటు కక్కలేక తెగ పరేషాన్ అవుతున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఏంటా ఆ కథా..!
Pawan Kalyan : పిఠాపురంలో పవన్ మాట్లాడిన దానిలో మరో కోణం ఉందా...పవన్ కు తనకు ఏదైనా పర్సనల్ థ్రెట్ ఉందనే సమాచారం వచ్చిందా..?అన్నీ తెలిసి కూడా ఇంటెలిజెన్స్ చూసీ చూడనట్లుగా ఉంటుందని పవన్ భావిస్తున్నారా..? హోంశాఖ విఫలమైందని అనడానికి కారణం అదేనా..? ఎప్పుడూ లేనిది పోలీసులపై పవన్ అంతలా సీరియస్ అందుకే అయ్యారా..? పవన్ కు హానీ కలిగించేలా ఎవరైనా కుట్రకు ప్లాన్ చేస్తున్నారా..? అందుకే పవన్ అంతలా రియాక్ట్ అయ్యారా..?
Telugu Desam Janasena : జనసేనలో చేరికలు టీడీపీనీ కలవరపరుస్తున్నాయా..? జనసేనలో చేరుతున్న వారంతా కూడా వైసీపీ వాళ్లే కావడంతో టీడీపీ టెన్షన్ పడుతుందా..? జనసేనలో రాజకీయ బలమున్న నేతల చేరికలు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయబోతుందా..? ప్రతిపక్ష వైసీపీ నేతలు అంతా కూడా జనసేనలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు..? ఈ చేరికల విషయంలో టీడీపీ ఏం చేయబోతుంది..?
టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు ఆశోక్ గజపతిరాజు, సుజనా చౌదరీల రాజీమానాకు ఆమోదం లభించింది. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి వారి రాజీనామాలకు ఆమోదం తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో నిన్న (గురువారం ) అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరీ పీఎం కార్యాలయానికి తమ రాజీనామా లేఖలను పంపిన విషయం తెలిసిందే. ఈ వ్యవధిలో ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య ఫోన్ సంభాషణ జరగడం.. అనంతరం మోడీ వారి రాజీనామాలను రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం వారి రాజీనామాలకు ఆమోదం లభించింది.
ఏపీ కేబినెట్ నుంచి వైదొలుగుతూ రాజీనామా సమర్పంచిన ఇద్దరు బీజేపీ మంత్రులపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. దేవదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇద్దరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని వారిని అభినందించారు. కామినేని శ్రీనివాస్ ఆరోగ్యశాఖలో కీలకమైన మార్పులు తీసుకొచ్చారని... దేవాలయాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి దేవదాయ శాఖ ఆదాయం పెరిగేలా మాణిక్యాలరావు కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.