నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ, సౌందర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతూ సౌందర్య ఆకస్మిక మృతితో ఆగిపోయిన నర్తనశాల మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాను పట్టాలెక్కిస్తున్నట్టు నిన్న సోమవారం ప్రకటించిన బాలయ్య బాబు.. చెప్పినట్టుగానే కొద్దిసేపటి క్రితం నర్తనశాల ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
Balakrishna, Soundarya in Nartanasala movie: పౌరాణిక చిత్రాలలో శ్రీ రాముడైనా, శ్రీ కృష్ణుడైనా తెలుగు ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది అన్న గారు సర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన నట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న తనయుడు నందమూరి బాలకృష్ణ కూడా ఈ జానర్ సినిమాల్లో బాగా ఒదిగిపోతారు. ఎంత పెద్ద డైలాగ్ అయినా సునాయాసంగా చెప్పేయగలరు. దసరా పండగ ( Dasara festival 2020) సందర్బంగా అభిమానులకు ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు బాలయ్య బాబు.
నటరత్న నందమూరి బాలకృష్ణ సినిమాకు పరిచయమై 46 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు (Balakrishna)కు నటుడు నారా రోహిత్ శుభాకాంక్షలు తెలిపారు.
‘కొందరి స్వార్థం కోసమే ఈ పనులు చేస్తున్నారు. నిజంగా ఇండస్ట్రీ బాగు కోసమైతే, నన్ను పిలవక పోయినా వస్తాను. ఇండస్ట్రీ కోసం ఎన్నో చేశాను. ఇకపైనా చేస్తూనే ఉంటానని’ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna Comments) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ జయంతి ( NTR birth anniversary ) సందర్భంగా ఇవాళ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన విగ్రహానికి లక్ష్మీ పార్వతీ ( Lakshmi parvathi ) నివాళులర్పించారు. ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించిన అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
'కరోనా వైరస్' లాక్ డౌన్ వేళ టాలీవుడ్లో #BetheREALMAN ఛాలెంజ్ కొనసాగుతోంది. అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ వంగా దీన్ని ప్రారంభించారు. ఇంట్లో ఉన్న మగవారు.. ఇంటి పనుల్లో సహాయం చేసి.. రియల్ మ్యాన్‌గా నిరూపించుకోవాలన్నది దీని ఉద్దేశ్యం. అంతే కాదు ఆయన దీన్ని దర్శక ధీరుడు రాజమౌళిని నామినేట్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమాలను వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశంసించారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఈ సందర్భంగా ఛాలెంజ్ విసిరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.