2017- 18 సంవత్సరానికి గాను రంజీ ట్రోఫీ గెలిచిన విదర్భ జట్టుకి ఆ టీమ్ అసోసియేషన్ భారీ నగదు పురస్కారాన్ని ప్రకటించడంతో క్రికెటర్ల ఆనందానికి హద్దులేకుండా పోయింది.
'జెర్సీ నెంబర్ 10' క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చొక్కా పై ఉండే నెంబర్. తాజాగా ఈ నెంబర్ కు వీడ్కోలు పలకాలని బీసీసీఐ అనధికారికంగా నిర్ణయించింది.
టీమిండియా నిషేధిత పేసర్ శ్రీశాంత్ - 'నాపై నిషేధం ఎత్తెయ్యకపోతే వేరే దేశం వెళ్లి ఆడుకుంటా..' అని బీసీసీఐపై ఎదురుదాడికి దిగాడు. ఇటీవల కేరళ హైకోర్ట్ ద్విసభ్య ధర్మాసనం శ్రీశాంత్ పై విధించిన నిషేధాన్ని పునరుద్ధరిస్తూ ఆదేశించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఆయన ఒక వార్తా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో "నాపై క్రికెట్ ఆడకూడదని నిషేధం ఉంది. నిషేధం ఎత్తెయ్యకపోతే నేను మరో దేశానికి వెళ్లి ఆడుకుంటా. నా వయసు 34. మహా అయితే ఆరేళ్ళు ఆడుతా. క్రికెట్ అంటే నాకు ఇష్టం. ఎలాగైనా ఆడాలన్నది నా కోరిక. బీసీసీఐ ఒక ప్రవేట్ సంస్థ మాత్రమే" అని పేర్కొన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.