ఐపీఎల్ ఫ్రాంచైజీలు, బ్రాడ్ కాస్టర్స్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఓ విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 19కి ముందే.. అంటే ఐపీఎల్ 2020 ప్రారంభానికి ముందే వార్మప్ మ్యాచ్‌లు (WarmUp Matches for IPL 2020) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
క్రికెట్లో కాసుల వర్షం కురిపించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు కిట్‌కు ఎలాంటి స్పాన్సర్ లేకపోవడం గమనార్హం. BCCI Sponsorship కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఆటగాళ్లకు కరోనా వైరస్ టెస్టులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాళ్లు, సిబ్బందికి కలిపి 13 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఐపీఎల్ ఆటగాళ్లు, సిబ్బందికి కోవిడ్ టెస్టులు నిర్వహణ నిమిత్తం 75 మందిని తీసుకున్నారు.
IPL 2020 మరెంతో దూరంలో లేదు. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఐపిఎల్ 2020 సీజన్‌కు ఈసారి టెలివిజన్ రేటింగ్స్ ( TV ratings ) మరింత పెరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ( Sourav Ganguly ) పేర్కొన్నాడు.
ఐపీఎల్ టోర్నీ( Ipl tourney ) షెడ్యూల్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అబుదాబిలో అమల్లో ఉన్న అత్యంత కఠినమైన కోవిడ్ నిబంధనలే దీనికి కారణం. బీసీసీఐ ఇప్పుడు ప్రత్యామ్నాయం కసం ఆలోచిస్తోంది.
ప్రతిష్టాత్మక 'అర్జున' అవార్డుకు ఎంపిక చేయడం పట్ల టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma) సంతోషం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన 13 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతి ఫలంగా లంబూ అభివర్ణించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 (IPL-2020) టోర్నీ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు దుబాయ్‌లో జరగనుంది. కరోనా (Coronavirus) వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఆరు నెలలపాటు ఇప్పటికే ఆలస్యమైంది. ఎలాగైనా 13వ సీజన్ టోర్నీ కప్‌ను సాధించాలన్న పట్టుదలతో ఇప్పటికే పలు జట్లు యూఏఈ చేరుకున్నాయి.
భారత్ లో కోవిడ్-19 పేషెంట్ల సంఖ్య 30 లక్షలను దాటేసింది. రోజురోజుకూ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. అందులో భాగంగా ఈ ఏడాది ఐపిఎల్ ను వాయిదా వేశారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 19 నుంచి క్రికెట్ అభిమానుల ఫేవరిట్ గేమ్ యూఏఈలో మళ్లీ మొదలు కానుంది. అయిత కరోనా నేపథ్యంలో ఆటగాళ్ల రక్షణ విషయంలో ఎలాంటి రిస్కు తీసుకోవడం లేదు. వారికి ప్రత్యేక కిట్ లు అందించడంతో పాటు మరెన్నోఏర్పాట్లు చేస్తున్నారు. చూడండి.
Suresh Raina Reply To PM Modi | దేశం కోసం ఆడేటప్పుడు మేం చెమట చిందిస్తాం. శక్తివంచన లేకుండా ఆడతాం. దేశ ప్రజలతో పాటు ప్రధాని సైతం మా సేవల్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందని సురేష్ రైనా ట్వీట్ చేశాడు.
బెస్ట్ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీలోని మరో కోణాన్ని, తుంటరి పనులను భారత మాజీ క్రికెటర్, స్టైలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman On MS Dhoni retirement) వెల్లడించాడు. ధోనీ రిటైర్మెంట్పై 2006లో కామెంట్లు చేశాడని లక్ష్మణ్ గుర్తుచేసుకున్నాడు.
భారత క్రికెట్ మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni ) అంతర్జాతీయ క్రికెట్ ఫార్మట్‌కు శనివారం రిటైర్మెంట్ ( dhoni retirement) ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ధోనీ అభిమానులు నిరాశకు గురై సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తనదైనశైలిలో స్పందించాడు. ప్రశ్నలు, కామాలు, ఆశ్చర్యాలు అంటూనే బాగా ఆడావు ధోనీ అని గంభీర్ ()Gautam Gambhir On MS Dhoni Retirement కామెంట్ చేశాడు.
భారత క్రికెట్ మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) అంతర్జాతీయ క్రికెట్ ఫార్మట్ నుంచి శనివారం రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ధోని రిటైర్మెంట్ ( dhoni retirement ) తీసుకుంటున్నట్లు ప్రకటించగానే.. అభిమానులంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు.
టీమిండియా లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni retires ) అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలకడం క్రికెట్ ప్రియులను షాక్‌కి గురిచేసింది. ధోనీ తీసుకున్న నిర్ణయంపై మన దేశానికి చెందిన క్రికెట్ దిగ్గజాలతో పాటు అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు సైతం ఒకరి తర్వాత మరొకరు స్పందిస్తున్నారు.
ఐపిఎల్ 2020 ( IPL 2020 ) స్పాన్సర్ షిప్ నుంచి చైనా బ్రాండ్ వివో ( Vivo ) డ్రాప్ అయ్యాక... నెక్ట్స్ ఎవరూ అనే విషయంపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Good News To Cricket Lovers: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020ని ( Indian Premier League 2020 ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.