బీసీసీఐ నేషనల్ సెలెక్షన్ కమిటీలో సెలెక్టర్ పోస్టుకు టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ దరఖాస్తు చేసుకున్నాడు. టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ రాజేష్ చౌహన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అమయ్ ఖురాసియా కూడా సెలెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు.
Hardik Pandya | గత కొన్ని నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న హార్ధిక్ పాండ్యా న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక అవుతాడని అంతా భావించారు. ఫిట్ నెస్ టెస్ట్‌లో విఫలమైన కారణంగా హార్ధిక్‌ను కివీస్ పర్యటనకు ఎంపిక చేయలేదని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.
దిగ్విజయంగా ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ విజయంతో ఊపుమీదున్న కోహ్లీసేన, సుదీర్ఘ కాలం తరవాత న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా టీమిండియా ఇప్పటికే ఆక్లాండ్ చేరుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మంగళవారం తన సహచరులైన శార్దూల్ ఠాకుర్, శ్రేయస్ అయ్యర్‌తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా ఉండగా
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. మిచెల్ స్టార్క్ వేసిన 23వ ఓవర్లో ఫోర్ బాదిన కోహ్లీ.. కెప్టెన్‌గా వన్డేల్లో 5వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. రోహిత్,
బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఆస్ట్రేలియా నిర్ణిత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు ఆదిలోనే వార్నర్ (3), ఫించ్ (19) వికెట్లు కోల్పోయింది.
2019-2020 సంవత్సరానికి బీసీసీఐ ప్రకటించిన 27 మంది సెంట్రల్ లిస్ట్ ధోని పేరు లేకపోవడంతో, ఇక ధోని కెరీర్ కు ముగింపు కార్డు పడినట్టేనా అనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 2018-2019 వార్షిక సంవత్సరంలో కేటగిరీ "A" లో ఉన్న ధోని ఈ సారి
ట్వంటీ20 ప్రపంచ కప్ కోసం భారత మహిళల జట్టు సిద్ధమవుతోంది. హర్యానా బ్యాటింగ్ యువ సంచలనం షఫాలీ వర్మ ఇటీవల టీ20 ప్రపంచ కప్ 15 మంది సభ్యులలో ఎంపికైన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 21న సిడ్నీలో ప్రారంభమయ్యే మహిళల ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే భారత జట్టులో హైదరాబాద్ కు చెందిన అరుంధతి రెడ్డి ఎంపికయ్యింది. బీసిసీఐ సెలక్షన్ కమీటీ ఆదివారం భారత మహిళల టీ20 ప్రపంచ కప్ భారత మహిళల తుదిజట్టును ఎంపిక చేసింది.
Pravin Tambe Disqualify to play in IPL: ప్రవీణ్ తాంబే వయసు 48ఏళ్లు. అయినా ఏ ఇబ్బంది లేకుండా ఆటను ఆస్వాదిస్తున్నాడు ఈ వెటరన్ ప్లేయర్. కాగా, తాజా ఐపీఎల్లో ఆడేందుకు ప్రవీణ్ తాంబే అనర్హుడయ్యాడు.
ఫిబ్రవరి 21నుంచి ఆస్ట్రేలియాలో పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ జరగనుంది. భారత జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ సారధిగా వ్యవహరిస్తుందని ట్విట్టర్లో బీసీసీఐ స్పష్టం చేసింది.
తనలో ఆల్ రౌండ్ నైపుణ్యం ఉందని, బ్యాట్‌తోనూ సత్తాగలనన్న నమ్మకం తనకు ఉందన్నాడు టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్. తాజాగా లంకతో జరిగిన టీ20లో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాడు.
టెస్టు జట్టుకు దూరమైనా, వన్డేలు ఆడుతున్న భారత స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, ఇకపై ఆటకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నాడా? ఇకపై వన్డేల్లో ధోనీని చూడలేమా? తాజాగా జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
రెండో టీ20లో శ్రీలంక నిర్దేశించిన 142 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా చేధించింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లో కేఎల్ రాహుల్ 45, శిఖర్ ధావన్ 32, శ్రేయాస్ అయ్యర్ 34,కెప్టెన్ విరాట్ కోహ్లీ 30 పరుగులు చేశారు.
వాషింగ్టన్ సుందర్ టీమిండియాకు తొలి బ్రేక్ ఇవ్వగా,4.5 ఓవర్లో అవిష్క ఫెర్నాండో(22)ని ఔట్ చేశాడు. భారీ షాట్ ఆడిన లంక ఓపెనర్ నవ్‌దీప్ సైనికి చిక్కాడు.
శ్రీలంకతో గువహాటిలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుందని అస్సామ్ క్రికెట్ అసోసియేషన్ తెలియజేసింది. శ్రీలంకతో భారత్ మూడు టీ20 ఆడనుంది. ఈ టీ20 సిరీస్ కు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో శిఖర ధావన్ వచ్చాడు.
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్‌పంత్ తన ప్రియురాలు ఇషా నేగితో కలిసి మంచు పర్వతాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియురాలితో కలిసి ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన రిషభ్.. ‘‘నేను నీతో ఉన్నప్పుడే నన్ను నేను బాగా ఇష్టపడతాను’’ అని క్యాప్షన్ పెట్టి ఆరెంజ్ రంగులో ఉన్న హృదయాకారపు ఎమోజీని జోడించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.