Ramdas Athawale: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆయనతో పాటు 71 మంది క్యాబినేట్, స్వతంత్య్ర, సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. అయితే నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో రామ్ దాస్ అఠావలె మరోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.
CNG PNG Price Updates: గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ధరల నియంత్రణకు కొత్త ఫార్ములాను తీసుకువచ్చింది. దీంతో సీఎన్జీ, పీఎన్జీ ధరలు పది శాతం తగ్గనున్నాయి. గ్యాస్ ధరలపై కేంద్ర కేబినెట్ సమావేశం గురువారం జరిగింది.
దేశంలో మహిళల కనీస వివాహ వయసు పెంపుపై మరో ముందడుగు పడినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. అమ్మాయిల కనీస వివాహ వయసు (Minimum age of marriage for women) 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది.
వెనుకబడిన తరగతుల (ఓబిసి)లకు 27% రిజర్వేషన్ల పరిస్థితిపై అధ్యయనం చేసే కమిటీ పదవీకాలం ఎనిమిదవ సారి కేంద్ర మంత్రివర్గం పొడిగించబడింది. దీనిపై స్పష్టతలేమి, పూర్తిస్థాయిలో అధ్యయనం చేయకపోవడంతో వివిద సాంకేతిక లోపాల కారణంగా జాప్యమవుతోందని తెలిపారు. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ లబ్దిదారులను అధ్యయనం చేయడానికి ఈ కమిటీని అక్టోబర్ 2017లో ఏర్పాటు చేశారు.
కేంద్ర కేబినెట్లో స్థానం లభిస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ గత కేబినెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. తనను కేబినెట్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి అరుణ్ జైట్లీ తాజాగా ఓ లేఖ రాశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.