CNG PNG Gas Price Reduced: గ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతుండడంతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ధరలను నియంత్రించేందుకు కొత్త ఫార్ములాకు ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు త్వరలో 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరలతోపాటు పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశ వివరాలను మీడియా సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
పైపుల ద్వారా సరఫరా చేసే సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్ ధరలపై గరిష్ట పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీని కోసం APM గ్యాస్‌పై ఒక MMBTU (Metric Million British Thermal Unit)కి 4 డాలర్ల బేస్ ధరగా.. దీంతో పాటు MMBTU గరిష్ట ధరను 6.5 డాలర్ల వద్ద ఉంచేందుకు ఆమోదముద్ర వేసింది. ఈ పరిమితి రెండేళ్లపాటు ఉండనుంది. రెండేళ్ల అనంతరం MMBTU 0.25 డాలర్ల చొప్పున పెంచనున్నారు. కిరీట్ పారిఖ్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సులను మంత్రి మండలి పరిశీలించింది. ఈ మేరకు గ్యాస్ ధర ఫార్ములాలో మార్పులు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కొత్త ఫార్ములా ప్రకారం సీఎన్‌జీ-పీఎన్‌జీ గ్యాస్ ధరలు ఇప్పుడు ముడి చమురుతో అనుసంధానించనున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దేశీయ గ్యాస్ ధర ఇప్పుడు భారత క్రూడ్ బాస్కెట్.. ప్రపంచ ధర నెలవారీ సగటులో 10 శాతం ఉంటుందని తెలిపారు. ఈ ధర ప్రతి నెల వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఫార్ములా పీఎన్‌జీ ధరలను 10 శాతం వరకు తగ్గిస్తుందని అన్నారు. సీఎన్‌జీ ధరలు 7 నుంచి 9 శాతం వరకు తగ్గుతాయన్నారు. సాధారణ గృహ వినియోగదారుల నుంచి వాహనాలు నడిపే వ్యక్తుల వరకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: Bandi Sanjay Got Bail: బండి సంజయ్‌కి బెయిల్ మంజూరు.. కస్టడి పిటిషన్‌పై విచారణ వాయిదా
కొత్త మార్గదర్శకాలు దేశీయ గ్యాస్ వినియోగదారులకు స్థిరమైన ధరలను నిర్ధారించడానికి రూపొందించారు. అదేసమయంలో ఉత్పత్తిని పెంచడానికి ప్రోత్సాహకాలతో ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ఉత్పత్తిదారులకు తగిన రక్షణను అందిస్తాయి. 2030 నాటికి భారతదేశంలో ప్రాథమిక శక్తి మిశ్రమంలో సహజ వాయువు వాటాను ప్రస్తుత 6.5 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సంస్కరణలు సహజ వాయువు వినియోగాన్ని విస్తరించడంలో సహాయపడతాయి. కేంద్ర కేబినెట్ నిర్ణయతో గృహాలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ), రవాణా కోసం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరలు గణనీయంగా తగ్గుతాయి.
ప్రస్తుతం దేశీయ గ్యాస్ ధరలు 2014లో ప్రభుత్వం ఆమోదించిన కొత్త డొమెస్టిక్ గ్యాస్ ధరల మార్గదర్శకాల ప్రకారం నిర్ణయిస్తున్నారు. దేశీయ గ్యాస్ ధరల కోసం 6 నెలల వ్యవధిలో ఉన్న వాల్యూమ్ వెయిటెడ్ ధరల ఆధారంగా కొత్త గ్యాస్ ధరలు ప్రకటిస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరలను నిర్ణయించేది. ఈ ధరలు ఏప్రిల్ 1, అక్టోబర్ 1న ప్రకటిస్తూ వస్తోంది. ఈ ధరలను నిర్ణయించడానికి కెనడా, అమెరికా, రష్యా వంటి దేశాలలో ప్రస్తుత ధరలను ఒక సంవత్సరంలో ఒక త్రైమాసికం విరామంతో బేస్ చేశారు. అయితే కొత్త విధానంలో ఈ ధరల పద్ధతిని దిగుమతి చేసుకున్న ముడి చమురు ధరలతో అనుసంధానించారు. ఇక నుంచి సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరలు నెలవారీగా ప్రకటించనున్నారు.
Also Read: Monkey Funny Video: వీడియో కోసం కోతికి అన్నం పెట్టింది.. ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి