తెలంగాణలో శనివారం కొత్తగా మరో 43 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన 43 కరోనా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 31 కేసులు నమోదు కాగా, గద్వాల్ జిల్లాలో 7, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో ఒకటి ఉన్నాయి.
దేశంలో గత 24 గంటల్లో 826 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇండియాలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,759కి చేరినట్టయింది. మరోవైపు గత 24 గంటల్లో 28 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ అమలు చేయడంతో రాజకీయ నాయకులు మీడియా సిబ్బందిని ఆహ్వానించకుండానే ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేయడానికి, వాణిజ్య సంస్థలు తమ సిబ్బందితో వెబినార్స్ (Webinars), ఆన్లైన్ మీటింగ్స్ (Online meetings) నిర్వహించుకోవడం, విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు చెప్పడం (Online classes), అధికారులు మిగతా సిబ్బందితో సమావేశం అవడం తదితర పనులకు జూమ్ యాప్‌ను (Zoom App) విరివిగా వినియోగిస్తున్నారు.
కరోనావైరస్ పాజిటివ్‌తో 69 ఏళ్ల డాక్టర్ చనిపోయిన ఘటన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో చోటుచేసుకుంది. షిల్లాంగ్‌లో బెతానీ ఆస్పత్రి డైరెక్టర్‌గా ఉన్న డా జాన్ సైలో కరోనాతో మృతి చెందగా.. అదే కుటుంబానికి చెందిన మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడం ఆందోళనకు దారితీస్తోంది.
కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 170 జిల్లాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. హాట్‌స్పాట్స్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి కొత్తగా ఇంకెవరికైనా కరోనా వైరస్ సోకిందా అని తెలుసుకునేందుకు దశల వారీగా అనుమానితుల శాంపిల్స్ సేకరించి పరీక్షకు పంపిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది.
గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖెరావాలాకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం అక్కడి రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. అహ్మెదాబాద్‌లోని జమాల్ పూర్-ఖేరియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గుజరాత్ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇమ్రాన్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
కరోనావైరస్ భయంతో మహారాష్ట్ర వణికిపోతోంది. మంగళవారం తెల్లవారే వరకు ఆ ఒక్క రాష్ట్రంలోనే 2,334 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా.. మంగళవారం మధ్యాహ్నం వరకు అప్డేట్స్ ప్రకారం మరో 121 మందికి కరోనా సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,455కి చేరింది.
కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (Coronavirus Positive cases) రోజురోజుకు పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,067కి చేరుకోగా అందులో ప్రస్తుతం 3,666 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో శనివారం నాడు కొత్తగా మరో 43 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన ఈ గణాంకాల ప్రకారం తాజాగా తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య 272కి చేరుకుంది.
కరోనావైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 15 మంది ప్రవాస భారతీయులు చనిపోయారు. విదేశాల్లో చనిపోయిన వారిలో అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్యే అత్యధికంగా ఆరుగురు ఉన్నారు. కరోనా వైరస్‌తో మృత్యువు విళయతాండవం చేసిన ఇటలీలో ఐదుగురు చనిపోగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) ఇద్దరు, ఇరాన్ (Iran), ఈజిప్టులో (Egypt) ఒకరు చొప్పున చనిపోయారు.
దేశంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 110కి చేరుకుంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. కొత్తగా మరిన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.