Nimisha Priya: యెమెన్‌లో భారతీయ నర్సుకు మరణశిక్ష పడింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత నర్స్ నిమిష ప్రియాకు ఆ దేశాక్షుడు మరణశిక్షను ఖరారు చేశారు. ఆ నర్సును విడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించింది.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు ఆ దేశంలో సుప్రీం కోర్టు మరణ శిక్ష విధించింది. దేశద్రోహం కేసులో ఆయన్ను దోషిగా తేల్చింది. 2007లో ఆనాటి ప్రజలకు ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దెదించి.. ఆర్మీ బలగాలతో కలిసి దేశ అధ్యక్ష పీఠాన్ని ఆయన కైవసం చేసుకున్నారు.
ఏడేళ్లుగా పోరాడుతున్నాం... మరో ఏడు రోజులు ఆగలేమా ? ఆగుతాం... డిసెంబర్ 18న నిర్భయ కేసు దోషులకు డెత్ వారెంట్ ఇష్యూ అవుతుందని భావిస్తున్నానని నిర్భయ తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్భయ కేసు విచారణ మళ్లీ వాయిదాపడింది. పటియాలా హౌస్ కోర్టులో నేడు కేసు విచారణ జరగాల్సి ఉంది. ఐతే అడిషనల్ సెషన్ జడ్జ్ సతీష్ కుమార్ అరోరా ఈ కేసు విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేశారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన వారికి ఉరి శిక్ష అమలు చేయాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దిశపై సామూహిక అత్యాచారం, హత్య.. గతంలో నిర్భయ అత్యాచారం, హత్య వంటి ఘటనల అనంతరం దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విపరీతమైన ఆగ్రహం వ్యక్తమైంది. నిందితులను కచ్చితంగా ఉరి తీయాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపించాయి. దిశ అత్యాచారం, హత్య కేసులో తెలంగాణ పోలీసులు నిందితులను ఎన్కౌంటర్ చేయడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
మరణశిక్షను రద్దు చేయడానికి ఇప్పుడు మరో దేశం కూడా రంగం సిద్ధం చేస్తోంది. ఉరిశిక్షకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమాలు చెలరేగుతుండడంతో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి.. ఎట్టకేలకు మరణశిక్షను రద్దు చేయాలని సంకల్పించినట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి గోబింద్ సింగ్ డియో తెలిపారు.
12 ఏళ్ల వయస్సు లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే వారికి మరణశిక్ష విధించేలా ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ (POCSO) యాక్ట్ ను సవరించేందుకు యోచిస్తున్నట్లు సుప్రీంకోర్టుకి కేంద్రం తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.