Nimisha Priya: యెమెన్‌లో భారతీయ నర్సుకు మరణశిక్ష..భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏం చెప్పిందంటే?

Nimisha Priya:  యెమెన్‌లో భారతీయ నర్సుకు మరణశిక్ష పడింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత నర్స్ నిమిష ప్రియాకు ఆ దేశాక్షుడు మరణశిక్షను ఖరారు చేశారు. ఆ నర్సును విడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించింది. 

Written by - Bhoomi | Last Updated : Dec 31, 2024, 12:47 PM IST
Nimisha Priya: యెమెన్‌లో భారతీయ నర్సుకు మరణశిక్ష..భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏం చెప్పిందంటే?

Nimisha Priya:  యెమెన్ లో ఓ హత్యానేరం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియాకు ఈ దేశాధ్యక్షుడు రషీద్ అల్ అలిమి మరణశిక్ష విధించారు. కేరళకు చెందిన ఈ నర్సును విడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఓ హత్యా నేరంపై దాదాపు 2017 నుంచి ఆమె యెమెన్ జైల్లోనే మగ్గుతోంది. కొన్ని నెలల్లోనే ఆమెకు శిక్షను అమలు చేయనున్నట్లు సమాచారం. తాజాగా ఈ అంశంపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ స్పందించారు. 

 "నిమిషా ప్రియకు యెమెన్‌లో శిక్ష విధించిన విషయం మాకు తెలుసు. ప్రియ కుటుంబం సంబంధిత ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోందని మేము అర్థం చేసుకున్నాము. ప్రభుత్వం ఈ విషయంలో సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తోంది అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్  తెలిపారు.

 నిమిషా ప్రియ భారతదేశంలోని కేరళ నివాసి. ఆమె 2011 నుంచి యెమెన్‌లోని సనాలో పనిచేస్తున్నారు. జూలై 2017లో యెమెన్ జాతీయుడైన తలాల్ అబ్దో మహదీ హత్య కేసులో నిమిషా దోషిగా తేలింది. 2018లో నిమిషాకు మరణశిక్ష పడింది. తన శిక్షకు వ్యతిరేకంగా ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. నిమిషా కుటుంబం ఆమె విడుదల కోసం చట్టపరమైన, దౌత్యపరంగా గణనీయమైన ప్రయత్నాలు చేసింది. సమాచారం ప్రకారం, యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి నర్సు నిమిషా ప్రియకు మరణశిక్షను ఆమోదించారు. నెల రోజుల్లో నిమిషాకు ఉరిశిక్ష పడుతుందని సమాచారం.

అసలేం జరిగిందంటే? 

నిమిష ప్రియ నర్సు కోర్సు పూర్తి చేసుకుని 2008తో యెమెన్ వెళ్లింది. అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె యెమెన్ లో ఓ క్లినిక్ పెట్టాలనుకుంది. కానీ ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యం అవుతుంది. దీంతో అక్కడి తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుని అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత మ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చింది ప్రియ. అది ముగిసిన వెంటనే యెమన్ తిరిగి వెళ్లిపోయింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలోనే ఉన్నారు. మెహది దీనిని అదునుగా భావించి ఆమెనుంచి డబ్బు లాక్కొవడంతోపాటు వేధించినట్లు ప్రియ కుటుంబం ఆరోపణలు చేస్తోంది. ఆమెను తన భార్యగా మెహది చెప్పుకోవడం మొదలుపెట్టి, పాస్ పోర్టు, ఇతర పత్రాలను తీసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. 

Also Read: Sankranti rangoli 2025: సంక్రాంతి ముగ్గులు ట్రై చేస్తున్నారా..గోమాత డిజైన్ ముగ్గులు.. ఇవిగో మీకోసం  

చివరికి ఆమెను కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వలేదు. 2016లో అతనిపై ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ ఆమెను పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి అతని వద్ద ఉన్న పాస్ పోర్టు స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ ఆడోస్ ఎక్కువవడంతో అతను మరణించాడు. ఆ తర్వాత డెడ్ బాడీని ఓ వాటర్ ట్యాంకులో పారేసింది చివరికి అక్కడి నుంచి సౌదీకి పారిపోతుండగా సరిహద్దులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

అయితే మ్రుతుడి కుటుంబానికి కొంత పరిహారం చెల్లిస్తే నిందితులను క్షమించి వదిలేసే ఛాన్స్ యెమన్ లో ఉంది. దీంతో ప్రియ కుటుంబం వారికి 40వేల డాలర్లను చెల్లించేందుకు సమీకరించింది. బాధితుడి కుటుంబంతో చర్చలు జరిపిన తర్వాత భారత దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసిన న్యాయవాది అబ్దుల్ అమిర్ 20వేల డాలర్లు డిమాండ్ చేశారని నిమిష ప్రియ తల్లి ప్రేమకుమారీ ఆరోపణలు చేశారు. దీంతో చ ర్చలు మధ్యలోనే ఆగిపోయాయి. 

Also Read: Rangoli 2025: న్యూ ఇయర్ కు ఈ సులభమైన ముగ్గులను ట్రై చేయండి..వాకిలిని అందంగా తీర్చిదిద్దండి

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News