తెలంగాణలో గత నాలుగైదు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు అన్నీ ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహించాయి. చాలా ప్రాంతాలు ఇంకా వరద ప్రవాహంలోనే ఉన్నాయి.
కరోనా వైరస్ ( Coronavirus ) వ్యాప్తిని నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం ( Telangana govt ) పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి (G. Kishan Reddy) ఆరోపించారు. కేంద్ర బృందం సలహాలు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, కరోనాతో హైదరాబాద్ ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
LockDown In Hyderabad | కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రవేశపెట్టిన లాక్డౌన్(lockdown) నిబంధనలు సడలించినప్పటి నుంచి హైదరాబాద్ (Hyderabad) నగరంలో, జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది.
Telangana politics: హైదరాబాద్: కరోనావైరస్ ( Coronavirus) విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana govt)పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP chief JP Nadda) నిరాధార ఆరోపణలు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ (Minister Etela Rajender) విమర్శలు గుప్పించారు.
కరోనా వైరస్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ కోవిడ్19 టెస్టులు జరిపిస్తున్నామని, తెలంగాణలో ఇప్పటివరకూ కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కరోనా టెస్టులకు ధర (CoronaVirus Test Cost) నిర్ణయించినట్లు తెలిపారు.
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుండటం అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కొంత ఊరటను కలిగిస్తోంది. మరోవైపు కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుండటం విశేషం.
తెలంగాణలో గురువారం కొత్తగా మరో 50 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 700 మార్కును చేరుకున్నట్టయింది. నేడు రాష్ట్రంలోని ఆస్పత్రుల నుంచి 68 మంది డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా వైరస్ నివారణ కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే రోగుల చికిత్స కోసం ఉపయోగిస్తున్న వైద్యపరికరాలు, మందులను వ్యాపార సంస్థలు బ్లాక్ మార్కెట్ చేయకుండా నియంత్రించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తిచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గురువారం 18 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, ఈ రోజు 665 నమూనాలను పరీక్షలకు పంపగా 18 మందికి పాజిటీవ్ అని తేలిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల వెల్లడించారు.
తెలంగాణలో ఏప్రిల్ 8, బుధవారం నాడు కూడా భారీ సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. బుధవారం కొత్తగా మరో 49 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనావైరస్ సోకిన వారి మొత్తం సంఖ్య 453కు చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
గాంధీ హాస్పిటల్లో డాక్టర్లపై దాడి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తమపై దాడి చేయడం ఏంటంటూ వైద్యులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తంచేశారు. రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లపై దాడి ఘటనతో గాంధీ ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారత్‌లోనూ కరోనావైరస్ కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళనరేకెత్తిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణ, రాజస్థాన్‌లలో కరోనావైరస్ బయటపడటంతో కరోనా వైరస్ భారత్‌కి కూడా వ్యాపిస్తోందా అనే టెన్షన్ మొదలైంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 11న గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఆ రోజు ఉదయం 11 గంటలకు ములుగు చేరుకోనున్న సీఎం కేసీఆర్.. అక్కడ కొత్తగా నిర్మించిన తెలంగాణ ఫారెస్ట్ కాలేజీని, హర్టికల్చర్ యూనివర్సిటీని ప్రారంభిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.