Huzurabad bypolls, Konda Vishweshwar Reddy supports Etela Rajender: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తాను ఈటల రాజేందర్‌కు మద్ధతు పలుకుతున్నట్టు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో పార్టీలకు అతీతంగా ఈటల రాజేందర్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Bandi Sanjay about CM KCR's districts tours: హైదరాబాద్: సీఎం కేసీఆర్ బీజేపికి భయపడ్డారని, అందువల్లే ఇటీవల గడీల నుంచి బయటికి వచ్చి జిల్లాల్లో పర్యటిస్తున్నారని బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు (Huzurabad bypolls) సహా వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపికే పట్టం కట్టబోతున్నారని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
Kadiyam Srihari Pressmeet: నేడు రైతుబంధు ద్వారా రాష్ట్రంలోని లక్షల మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి సొంతమన్నారు. నేటి నుంచి వారం లేదా పది రోజులపాటు అర్హులైన రైతులకు రైతుబంధు సాయం అందించడానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు.
Narrow escape for Etela Rajender and all other Telangana BJP leaders as flight mishap averted: న్యూ ఢిల్లీ: ఈటల రాజేందర్ సహా తెలంగాణకు చెందిన కీలక బీజేపి నేతలు తృటిలో పెను ప్రమాదం బారి నుంచి బయటపడ్డారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సందర్భంగా ఢిల్లీ వెళ్లి వస్తున్న బీజేపి నేతల బృందం ప్రయాణిస్తున్న విమానానికి తృటిలో ప్రమాదం (Flight accident averted) తప్పింది.
TTDP chief L Ramana party change news:హైదరాబాద్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని, ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయన్ని కలిసి మంతనాలు జరపగా.. వారికి రమణ సానుకూలంగా స్పందించారని ఇటీవల వార్తలొచ్చాయి. ఈటల రాజేందర్ (Etela Rajender) పార్టీ వీడటంతో ఖాళీ అయిన బీసీ నేత స్థానాన్ని ఎల్ రమణతో భర్తీ చేయాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారనే టాక్ వినిపించింది.
Etela Rajender Joins BJP: తెలంగాణ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్, మరికొందరు నేతలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. దాదాపు 20 మంది నేతలు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
Etela Rajender: ఊహించిందే జరగబోతోంది. మాజీ మంత్రి, టీఆర్ఎస్ రెబెల్ నేత ఈటెల రాజేందర్ కమలం గూటికి చేరనున్నారు. సొంతంగా పార్టీ పెట్టనున్నారనే ప్రచారానికి చెక్ పడింది.
Harish Rao slams Etela Rajender:హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో మంత్రి హరీష్ రావు తన కంటే ఎక్కువ అవమానాలపాలయ్యారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. Etela Rajender తనకు నైతిక బలం, మద్దతు పెంచుకోవడం కోసం నా భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటే అది ఆయన పొరపాటే అవుతుందని మంత్రి హరీష్ రావు స్పష్టంచేశారు.
Etela Rajender to join BJP: కరీంనగర్: ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో మాజీ మంత్రి ఈటలపై మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. బీసీలను మోసం చేసిన ఈటల రాజేందర్‌కు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు.
Etela Rajender Sensational Comments: సీఎం కేసీఆర్‌పై, రైతు బంధు సహా పలు అంశాలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
Etela Rajender Resigns to TRS: ఇటీవల తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
Etela Rajender to join BJP: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని ఆయనతో పడని బీజేపి నేతలు అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ (BJP MLA Raja Singh) తనదైన స్టైల్లో స్పందించారు.
Gangula Kamalakar vs Eatala Rajender: ఈటల ఆరోపణలు, విమర్శలకు మంత్రి గంగుల కమలాకర్ వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చారు. తాను కూడా బీసీ బిడ్డనేనంటూ గంగుల మీసం మెలి వేయడం గమనార్హం. మరోసారి బిడ్డ అనే పదం వాడితే మంచిగా ఉండదు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు.
Ys sharmila party: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారారు. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
ప్రజల్లో కరోనావైరస్ వ్యాక్సిన్ (Corona vaccine)పై నమ్మకం పెంచేందుకు తొలి టీకాను తానే తీసుకుంటానని తెలంగాణ (Telangana) వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కొత్తరకం కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని, బర్డ్‌ఫ్లూ వల్ల కూడా ఎలాంటి నష్టం లేదని ఈటల స్పష్టంచేశారు.
New CoronaVirus Strain: కరోనా వైరస్ తర్వాత ప్రస్తుతం పుట్టుకొచ్చిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో ఇప్పటికే పలు దేశాలు ఇతర దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించాయి. అయితే దీనిపై ఆందోళన అక్కర్లేదని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
Corona Second Wave In Telangana: కరోనా ఫస్ట్ వేవ్‌తో ప్రమాదం ఏమీ లేదని.. కానీ కరోనా సెకండ్ వేవ్‌తో ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర ప్రజలను మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. రోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు.
New CoronaVirus In Telangana: బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ప్రయాణికులలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కొత్త కరోనా వైరస్ బ్రిటన్‌లో కలకలం రేపుతున్న నేపథ్యంలో గత రెండు వారాలుగా విదేశాల నుంచి వస్తున్న వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా వరంగల్ లో ముంపు ప్రాంతాలు పెరిగాయి. తెలంగాణ మంత్రులు నేడు వరంగల్ లో ఏయిల్ వ్యూలో పరిస్థితిని తెలుసుకున్నారు. తరువాత క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. ఇందులో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.