Etela Rajender Joins BJP: బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్

Etela Rajender Joins BJP: తెలంగాణ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, మరికొందరు నేతలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. దాదాపు 20 మంది నేతలు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 14, 2021, 12:27 PM IST
  • బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్
  • ఏనుగు రవీందర్, రమేష్ రాథోడ్ సహా పలువురు నేతలకు కండువా కప్పిన కేంద్ర మంత్రి
  • తన శక్తివంచన లేకుండా బీజేపీ కోసం శ్రమిస్తానన్న ఈటల రాజేందర్
Etela Rajender Joins BJP: బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్

Etela Rajender Joins BJP in New Delhi: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, మరికొందరు నేతలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. దాదాపు 20 మంది నేతలు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పి ఈటల రాజేందర్ (Etela Rajender)ను సాదరంగా పార్టీలోని ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్, తుల ఉమ, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి సహా పలువురు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, తదితర నేతలు పాల్గొన్నారు.

Also Read: Govt employees salary hike: పీఆర్సీ అమలుకు ఉత్తర్వులు జారీ.. పెరగనున్న జీతాలు

ఉద్యమనేత అయిన ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ఆర్థికశాఖ మంత్రిగా వ్యవహరించారు. కేసీఆర్ కుడి భుజంగా చెప్పుకునే ఈటల పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు సైతం నిర్వర్తించారు. 2019లో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ (Telangana CM KCR) రెండవ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు అందించారు. భూముల ఆక్రమణ ఆరోపణలతో ఈటల రాజేందర్‌ను మే 2న కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు.

Also Read: Petrol Price Today: హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర, డీజిల్ దూకుడు 

తనపై అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు ఏ వివరణ కోరకుండా సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరుతో ఈటల రాజేందర్ నొచ్చుకున్నారు. ఆత్మగౌరవంతో తాను టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నానని కొన్ని రోజుల కిందట ప్రకటించిన ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనా చేయడం తెలిసిందే. బీజేపీలో ఈటల రాజేందర్ చేరికతో పార్టీ మరింత బలపడిందని కాషాయ శ్రేణులు భావిస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News