ఈనెల 11న ములుగుకు సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 11న గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఆ రోజు ఉదయం 11 గంటలకు ములుగు చేరుకోనున్న సీఎం కేసీఆర్.. అక్కడ కొత్తగా నిర్మించిన తెలంగాణ ఫారెస్ట్ కాలేజీని, హర్టికల్చర్ యూనివర్సిటీని ప్రారంభిస్తారు.

Last Updated : Dec 8, 2019, 12:30 AM IST
ఈనెల 11న ములుగుకు సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 11న గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఆ రోజు ఉదయం 11 గంటలకు ములుగు చేరుకోనున్న సీఎం కేసీఆర్.. అక్కడ కొత్తగా నిర్మించిన తెలంగాణ ఫారెస్ట్ కాలేజీని, హర్టికల్చర్ యూనివర్సిటీని ప్రారంభిస్తారు. తమిళనాడులోని మెట్టుపాలయంలో అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌లో విద్యను అభ్యసించి.. అక్కడ నుంచి దాదాపు 120 మంది ఐఎఫ్ఎస్ అధికారులుగా ఎంపికయ్యారు. దీనిని స్పూర్తిగా తీసుకునే తెలంగాణ విద్యార్థులను కూడా ఐఏఎఫ్ అధికారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 2016లో తెలంగాణ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్‌ను ఏర్పాటు చేసింది. ఆ కాలేజి కోసమే ములుగులో విశాలమైన ప్రాంగంణంలో భవన సముదాయం నిర్మించారు. ఈ భవన సముదాయానికి ముఖ్యమంత్రి 11న ప్రారంభోత్సవం చేస్తారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవనాల అభివృద్ధి, పరిశోధన కోసం ములుగులో హర్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీ భవన సముదాయాన్ని కూడా ముఖ్యమంత్రి అదే రోజున ప్రారంభించనున్నారు. 

అటవీశాఖ మంత్రి ఐకె ఇంద్రకరణ్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Trending News