ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 62,123 శాంపిల్స్ ( COVID-tests ) పరీక్షించగా అందులో 10,080 మందికి కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus ) అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 2,17,040 మందికి చేరింది.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. సాధారణ ప్రజానికం నుంచి ప్రముఖుల వరకు అనేక మంది కరోనాబారిన పడుతున్నారు. ఇప్పటికే కరోనావైరస్ బారినపడిన వారిలో పలువురు తెలంగాణ మంత్రులు, డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజా ప్రతినిధులు ఉండగా.. తాజాగా ఆ జాబితాలో మంత్రి మల్లా రెడ్డి కూడా చేరారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 10,171 కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus ) కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,06,960కి మందికి చేరింది.
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 11 మంది కరోనావైరస్తో ( Coronavirus ) బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్లో చేరారు ( Sonia Gandhi Admitted to Hospital).
ఏపీలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో 70,068 శాంపిల్స్‌ను పరీక్షించగా 10,167 మందికి కరోనావైరస్ ( Coronavirus) సోకినట్టు నిర్ధారణ అయింది.
Hyderabad collector Sweta mohanty: హైదరాబాద్: తెలంగాణలో నిత్యం వెలుగుచూస్తున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులలో హైదరాబాద్ నగరంలోనే ( Hyderabad ) అధిక సంఖ్యలో కేసులు ఉంటున్నాయనే సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి కూడా కరోనావైరస్ సోకిన బాధితుల జాబితాలో చేరారు.
Coronavirus in AP: అమరావతి: ఏపీలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం 20,590 శాంపిల్స్ పరీక్షించగా.. 1,775 మందికి కరోనావైరస్ ( COVID-19 ) సోకినట్టు తేలింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 17 మంది కరోనాతో చనిపోయారు.
COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 1,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. నేడు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 762 కేసులు నమోదయ్యాయి. తాజాగా విడుదలైన కోవిడ్-19 హెల్త్ బులెటిన్ ( COVID-19 health bulletin ) ప్రకారం కరోనావైరస్ కారణంగా ఇవాళ ఎనిమిది మంది మృతి చెందారు.
COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో గురువారం కొత్తగా 1,410 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎప్పటిలాగే అందులోనూ జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే మొత్తం 918 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ హెల్త్ బులెటిన్ ( Health bulletin ) విడుదల చేసింది.
Coronavirus tests in Telangana | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ నిర్ధారణ పరీక్షల విషయంలో తెలంగాణ హై కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు సూచనలు చేసింది. ఏరోజుకు ఆ రోజు విడుదల చేస్తోన్న హెల్త్ బులెటిన్స్‌లో కరోనావైరస్ వ్యాప్తి, కోవిడ్-19 పరీక్షల ఫలితాలకు సంబంధించిన కీలక సమాచారం పొందుపర్చాల్సిందిగా హైకోర్టు తెలంగాణ సర్కారుకు సూచించింది.
Telangana govt | హైదరాబాద్: కరోనావైరస్ పరీక్షల విషయంలో ఐసిఎంఆర్ మార్గదర్శకాలతో పాటు ( ICMR guidelines ) కోర్టు ఆదేశాలు అమలు చేయడంలేదని హై కోర్టు తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇకనైనా పరిస్థితిలో మార్పు రాకుంటే.. అందుకు బాధ్యులైన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హైకోర్టు ( High court) హెచ్చరించింది.
Coronavirus positive cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 206 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 tests) 206 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని తాజాగా సర్కారు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది.
అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేస్తున్నారని.. అందుకే రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతోందని వస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపించడం (Coronavirus spread in Telangana) తగ్గిందా అంటే గత మూడు రోజులుగా నమోదవుతున్న సింగిల్ డిజిట్ కేసులను చూస్తోంటే అవుననే అనిపిస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి తెలంగాణలో ఏరోజుకు ఆరోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నప్పటికీ.. చాలా రోజుల తర్వాత శనివారం మాత్రం కొత్తగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం విశేషం.
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 37 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అదే సమయంలో కొత్తగా మరో 1,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో శుక్రవారం రాత్రి నాటికి దేశంలో మొత్తం కొవిడ్ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23,452 చేరుకుంది.
భారత్‌లో కరోనా వైరస్‌ను నియంత్రించే దిశగా సరైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి టెక్నాలజీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ బుధవారం ఓ లేఖ రాశారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బుధవారం నాడు కొత్తగా 1,486 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20,471కు చేరుకుంది. గత 24 గంటల్లో 49 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనావైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 652కి చేరింది.
తెలంగాణలో బుధవారం కొత్తగా మరో 15 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. నేడు గుర్తించిన 15 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 943కి చేరింది. అందులో 725 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.