తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2020 వార్షిక బడ్జెట్ సమావేశాలు మార్చి 6వ తేదీన ప్రారంభం కానున్నాయని, ఈ సమావేశాలు రెండు వారాలపాటు జరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మోడల్ మార్కెట్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి వచ్చే కంపెనీలకు పూర్తి సహాకారం అందిస్తామని, నూతన పెట్టుబడులకు అవసరమైన మౌళిక వసతుల కల్పన చేపట్టాలని పరిశ్రమల శాఖాధికారులకు ఆదేశాలిచ్చామని ఐటీ శాఖామాత్యులు కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలు, ఐటీ శాఖలపైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమీక్షలో మాట్లాడుతూ..
హైదరాబాద్ శివారు ప్రాంతం వద్ద గల హయత్ నగర్ రాఘవేంద్ర కాలనీలో ఒకే రూంలో ప్యాన్ కు ఉరేసుకొని ఇద్దరు యువతులు మమత(20),గౌతమి(20) అనే ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మమత, గత కొన్నేళ్ళ క్రితం నగరానికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి హయత్ నగర్ శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటున్నారు.
బెంగళూరులోని వొడాఫోన్-ఐడియా వినియోగదారులు తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా నెట్వర్క్లలో కొంతమంది వినియోగదారులు చేసిన ఫిర్యాదుల ప్రకారం, టెలికాం ప్రొవైడర్ కనీసం ఒక గంట సెల్యులార్ నెట్వర్క్ను అందించడం లేదని, ఉదయం నుండి సమస్యలు ఎదుర్కొంటున్నామని,
దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కలసి పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి, అడిషనల్ డీ.జీ. జితేందర్ లు పర్యటించారు.
సరుకు రవాణా చేసే కార్గో బస్సులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రయత్నాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పు పట్టారు. ఆర్టీసీ బస్సులను సరుకు రవాణాకు ఉపయోగించడం వల్ల ప్రజలకు సేవలు అందించడం, ఆర్టీసీ లాభాల్లో పయనించడం తమ లక్ష్యం అన్నారు.
తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే .తారకరామారావుకు మరోసారి ప్రముఖ అంతర్జాతీయ ఆహ్వానం అందింది. ఈసారి హార్వర్డ్ యూనివర్సిటీ కేటీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈసారి జరగనున్న హార్వర్డ్ యూనివర్సిటీ
జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ అభివృద్ధిపై రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. జహీరాబాద్ మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆయన సూచించారు. మున్సిపాలిటీలోనే దాదాపుగా 35 కోట్లరూపాయల నిధులు ఉన్నాయని, అధికారులు నూతన ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని సూచించారు.
రమణ తేజ దర్శకత్వంలో ఉష మల్పూరి నిర్మాతగా ముస్తాబవుతోన్న చిత్రం అశ్వథామ. యంగ్ హీరో నాగశౌర్య తన "అశ్వథామ"ను సూపర్ డూపర్ హిట్ గా మార్చడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. తన కెరీర్లోనే అత్యుత్తమైమనదిగా అభిప్రాయపడుతున్నాడు. నటి సమంతా
సాంప్రదాయకంగా జనవరి నెలలో సాధారణంగా స్వైన్ ఫ్లూ కేసులలో పెరుగుదల కనిపిస్తుంది. శీతాకాలంలో కాలానుగుణంగా స్వైన్ ఫ్లూ కేసులతో ముంచెత్తడానికి చల్లని వాతావరణ పరిస్థితులు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఏదేమైనా, జిల్లాలోని ప్రజారోగ్య నిపుణులు, వ్యాధి పర్యవేక్షణ అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటి, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయాలంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరిపేందుకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.