COVID 4th Wave in India: ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందా ? ఇదే విషయమై మేధావులు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. తాజాగా ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. " రాబోయే కొద్దిరోజులు భారత్ కి అంత శుభసూచికంగా లేకపోవచ్చు " అని అన్నారు.
Lockdown in India: దేశంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తొలి దశలో ఏడు రోజుల పాటు లాక్ డౌన్ విధించి, గతంలో తరహాలోనే కఠినమైన ఆంక్షలు విధిస్తారనేది ఆ వైరల్ పోస్ట్ సారాంశం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ మెసేజ్ చూసి కొంతమంది జనం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
BF.7 Variant In India: ఒమిక్రాన్ బిఎఫ్7 వేరియంట్ కేసులు చైనాను వణికిస్తున్నాయి. చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరగడానికి కారణం ఈ ఒమిక్రాన్ బిఎఫ్. 7 వేరియంట్ కేసులే అనే సంగతి తెలిసిందే. అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే గుణం ఉన్న ఈ బిఎఫ్. 7 వేరియంట్ వల్లే చైనాలో అతి కొద్ది కాలంలోనే ఫోర్త్ వేవ్ భయం గడగడలాడిస్తోంది.
Covid 4th Wave in India: మెడికల్ ఆక్సిజన్, మాస్క్‌లు, మందులు, పిపిఇ కిట్ల కొరత లేకుండా పేషెంట్స్ వైద్య సహాయానికి అవసరమైన అన్ని వస్తువులను ముందుగానే తగినంత నిల్వలు అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా కేంద్రం స్పష్టం చేసింది.
Mock Drills In India: ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్ కార్యక్రమాన్ని నేరుగా పర్యవేక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాందవియ స్వయంగా ఏదైనా ఒక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శిస్తారని అధికారులు తెలిపారు. కరోనావైరస్కి చెక్ పెట్టేందుకు చేపట్టిన చర్యలో భాగంగానే భారత్ బయోటెక్ తయారు చేసిన నాజల్ కొవిడ్ వ్యాక్సిన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కేంద్రం వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.