Mock Drills In India: చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారీగా పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఆందోళనకు గురిచేస్తోన్న నేపథ్యంలో భారత్ సైతం రాబోయే కొవిడ్ విపత్తును ఎదుర్కొనేందుకు అన్నివిధాల సిద్ధం అవుతోంది. అందులో భాగంగానే మంగళవారం నుండి దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొవిడ్-19 కేసులు భారీగా పెరిగితే ఆ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్స్, లాజిస్టిక్స్, మానవ వనరులు వంటి సర్వ సౌకర్యాలను సంసిద్ధంగా ఉండేలా చూసే లక్ష్యంతోనే ఈ ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్స్ చేపడుతున్నట్టు కేంద్రం తమ ప్రకటనలో స్పష్టంచేసింది.
A mock drill for emergency response to deal with #COVID19 cases will be conducted in hospitals across the country on Tuesday, 27th December. Union Health Minister Mansukh Mandaviya will also visit a government hospital for the mock drill: Sources
— ANI (@ANI) December 23, 2022
ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్ కార్యక్రమాన్ని నేరుగా పర్యవేక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాందవియ స్వయంగా ఏదైనా ఒక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శిస్తారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసుల దృష్ట్యా దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ 2023 సెలబ్రేషన్స్ కోసం కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది.
Govt of India approves Nasal vaccine. It will be used as a heterologous booster & will be available first in private hospitals. It will be included in #COVID19 vaccination program from today: Official Sources pic.twitter.com/eaxVoX2Hp9
— ANI (@ANI) December 23, 2022
కరోనావైరస్‌కి చెక్ పెట్టేందుకు చేపట్టిన చర్యలో భాగంగానే భారత్ బయోటెక్ తయారు చేసిన నాజల్ కొవిడ్ వ్యాక్సిన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కేంద్రం వెల్లడించింది. " ఇప్పటివరకు ఎవరైతే కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్స్ తీసుకున్నారో.. వారు ఈ నాజల్ వ్యాక్సిన్‌ని బూస్టర్ డోస్‌గా తీసుకోవచ్చు " అని కేంద్రం పేర్కొంది. శుక్రవారం సాయంత్రం నుండి కొవిన్ అధికారిక వెబ్‌సైట్‌లో నాజల్ వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ అందుబాటులోకి రానుంది.
ఇది కూడా చదవండి : BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎందుకంత వణికిస్తోంది ? లక్షణాలు ఏంటి ?
ఇది కూడా చదవండి : BF.7 Variant News: ఇండియాలో కరోనా పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన కొవిడ్ ప్యానెల్ చీఫ్ అరోరా
ఇది కూడా చదవండి : BF.7 Variant Cases in India: వామ్మో.. చైనాను హడలెత్తిస్తున్న వేరియంట్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook