Covid 4th Wave in India: చైనాతో పాటు అనేక ఇతర ప్రపంచ దేశాల్లో కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ప్రస్తుతానికి భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిగా ఉన్నప్పటికీ.. చైనాలో లాంటి దుస్థితి మన వద్ద రాకముందే మేల్కోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుగానే అన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే డిసెంబర్ 27న దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించిన కేంద్రం తాజాగా రాష్ట్రాలకు మరో లేఖ రాసింది. ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్గదర్శకాలను రాష్ట్రాలకు స్పష్టంచేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మరో లేఖ రాశారు.
ఆరోగ్య శాఖ మంత్రి రాసిన లేఖలోని ముఖ్యమైన అంశాలు
ఆసుపత్రులు, పడకలతో రాబోయే విపత్తును ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు సూచించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.
ఐసీయూ, ఐసోలేషన్, ఆక్సిజన్ సపోర్ట్ కలిగిన బెడ్స్, వెంటిలేటర్‌తో కూడిన పడకల సంఖ్యను పెంచాలని కోరిన కేంద్రం.
ఆసుపత్రుల్లో రోగుల తాకిడిని ఎదుర్కొనేలా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సంఖ్యను పెంచాల్సిందిగా రాష్ట్రాలకు సూచించిన కేంద్రం.
ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ కేసులు దేశంలోకి ప్రవేశించిన నేపథ్యంలో కొత్త వేరియంట్ కేసులను గుర్తించేందుకు వీలుగా పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్రాన్ని కోరిన కేంద్రం.
మెడికల్ ఆక్సిజన్, మాస్క్‌లు, మందులు, పిపిఇ కిట్‌ల కొరత లేకుండా పేషెంట్స్ వైద్య సహాయానికి అవసరమైన అన్ని వస్తువులను ముందుగానే తగినంత నిల్వలు అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా కేంద్రం స్పష్టం చేసింది. ఎలాంటి హెల్త్ ఎమర్జెన్సీని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టంచేసింది. ఆక్సిజన్ ప్లాంట్స్, వెంటిలేటర్లు, లాజిస్టిక్స్, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సంఖ్య పెంపు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్రం సూచించింది.
ఇది కూడా చదవండి : India BF7 Variant: కొవిడ్ కొత్త వేరియంట్‌పై కేంద్రం అలెర్ట్.. నేటి నుంచి విదేశీ ప్రయాణికులకు కరోనా టెస్టులు!
ఇది కూడా చదవండి : Free Ration Scheme: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 2023 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం
ఇది కూడా చదవండి : India's COVID Cases: దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook