Bandi Sanjay Warning to KCR: బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయబోమని, ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్లు పదవులకు రాజీనామా చేసిన తరువాతే బీజేపీలోకి తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ధరణి మంచి పోర్టల్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘‘ధరణి వల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే. ఆ కుటుంబం లాక్కున్న భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికే ధరణి తెచ్చారు. ఆ పోర్టల్ బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు’’అంటూ ఎద్దేవా చేశారు.
Telangana bjp chief bandi sanjay: తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెక్ బౌన్సర్ సీఎం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రైతులు బతికే పరిస్థితి లేదని కేసిఆర్ పుణ్యమా అని రైతులు బ్యాంకులలో డిఫాల్టర్లుగా నమోదయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.
BRS MLC Kalvakuntla Kavitha: “బీఆర్ఎస్ పార్టీ కుటుంబం చాలా పెద్దది. కేసీఆర్ మనస్సు పెద్దది. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఇతర పార్టీల బహిరంగ సభల కంటే పెద్దగా జరుగుతున్నాయి. గులాబీ కండువా కప్పుకున్న వాళ్లందరికీ పెద్ద బాధ్యత ఉంటుంది. గులాబీ కండువా కప్పుకున్నామంటే తెలంగాణ ప్రజలకు గులాముల్లాగా పనిచేయాలి" అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
YS Sharmila Slams BJP, BRS: బీఆర్ఎస్ పార్టీ, బీజేపి మధ్య రహస్య స్నేహం ఉందన్న వైఎస్ షర్మిల.. ఈ రెండు పార్టీల తీరు లోకం ముందు నువ్వు కొట్టినట్లు చేస్తే.. నేను ఏడ్చినట్లు చేస్తా.. అన్న చందంగా ఉంది అని ఎద్దేవా చేశారు. అంతటితో ఊరుకోని వైఎస్ షర్మిల.. ఇంతకీ మీరు నడిపే రహస్య దోస్తానం ప్రీ పోల్ ఒప్పందమా ? లేక పోస్ట్ పోల్ ఒప్పందమా ? అని సూటిగానే ప్రశ్నించారు.
Telangana Formation Day : తెలంగాణలో కుటుంబ పాలనతో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దొరికి అన్ని చోట్లా అప్పులు తెస్తున్నారని, తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా? అని నిలదీశారు. నిధులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నాడు.
Harish Rao : రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం డబ్బులు చెల్లించిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రైతు బంధు ఇస్తున్నామని తెలిపాడు. ఇప్పుడు రైతుల అదాయం పదింతలు పెరిగిందని అన్నాడు. రైతులు చనిపోతే భీమా సైతం ఇస్తుందని అన్నాడు.
Ex Minister Vivek : పార్టీ మారుతున్నట్టుగా వస్తోన్న రూమర్లను ఖండించాడు మాజీ ఎంపీ, బీజేపీ జాతియ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ నియంత పాలనను ముగింపు పలకడానికి, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం ఆగదని వివేక్ అన్నారు.
ప్రజా సమస్యలపై బీజేపీ పోరాడుతుంటే... ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలని మండిపడ్డారు. పొరపాటున కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే యువత అంతా సూసైడ్ నోట్ రాసుకున్నట్లేనని హెచ్చరించారు. కొలువులు కావాలంటే కమలం రావాలంటూ నినదించారు. ఖమ్మం నిరుద్యోగ ర్యాలీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బండి సంజయ్ చురకలు అంటించారు.
Telangana Congress : కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉదయం సమావేశం కానున్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్యరావ్ ఠాకూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు ఈ సమావేశంలో భేటీ కానున్నారు. జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల మీద చర్చించనున్నారు.
Telangana : రాష్ట్ర ప్రగతి, అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం ప్రత్యేకంగా సమీక్షను చేపట్టాడు.
Revanth Reddy : సీఎం కేసీఆర్ తన చర్మాన్ని వలిచి చెప్పులు కుట్టించినా కూడా పాలమూరు ప్రజల రుణాన్ని తీర్చుకోలేరని రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో అయితే ప్రజలు ఓడిస్తారని పాలమూరులో ఆదరించారని, అలాంటి వారిని కూడా సీఎం కేసీఆర్ మోసం చేశారని తన పాదయాత్రలో రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Telangana 10 years Celebrations Events List Schedule: " తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల " నేపథ్యంలో జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్లాన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆ ఉత్సవాల రోజు వారీ కార్యక్రమాల షెడ్యూల్ ను ఖరారు చేసింది.
Podu Bhoomulu Pattas: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
MP Soyam Bapu : పెళ్లి వేడుకల్లో సోయం బాపు చిందులు వేశారు. తన కొడుకు పెళ్లి వేడుకల్లో సోయంబాపురావు సందడి చేశారు. వివాహా అనంతరం ఆదివాసి సంప్రదాయ పాటలకు డ్యాన్సులు వేశారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా కనిపించారు.
Dasoju Sravan : రెండు వేల నోట్ల రద్దు అనేది పెద్ద స్కాంలా కనిపిస్తోందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. దీనిపై విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీని వల్ల దేశానికి ఎలా ప్రయోజనం అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశాడు.
CM KCR : తెలంగాణ కేటినేట్ సమావేశం నేడు జరగనుంది. కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ భేటీ జరుగుతుంది. పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు. కొత్త సచివాలయంలో తొలి భేటి అవ్వడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
CM KCR : ఇవాళ, రేపు సీఎం కేసీఆర్ వరుస సమావేశాలతో హీట్ పెంచబోతోన్నారు. మధ్యాహ్నం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు జరగన్నాయి. కొత్త సచివాలయంలో మొదటి సారిగా భేటీ జరగనుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఉంటాయా? అనే దానిపై చర్చించుకోనున్నారు.
BRS Party : బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర నేతలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో పలువురు ముఖ్య నేతలు పార్టీ కండువా కప్పుకున్నారు. ముంబై మహా నగర మాజీ మేయర్ కూడా బీఆర్ఎస్లో చేరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.