Kamareddy MLA Election: కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు అనుకూలంగా ఓటేస్తామంటూ 10 గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వయంగా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రావడం ఏకగ్రీవ తీర్మానాలు చేయడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Revanth reddy Speech at SC, ST Decleration: తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేతిలో అత్యధికంగా దగాకు గురైంది దళితులు, గిరిజనులే అని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అంటున్నారు. అవును.. 60 వేల బెల్టు షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
KCR Praises Allu Arjun For Winning Best Actor Award at National Film Awards: కథానాయకుడిగా, పలు సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలద్వారా తెలుగు సహా జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్, తమ నటనా ప్రతిభతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు చలనచిత్ర కళాకారుడు కావడం, తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణమన్నారు.
KCR vs Shabbir Ali vs Venkataramana Reddy: కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా కామారెడ్డి అసెంబ్లీ ముఖ చిత్రం మారిపోయింది. ఏకంగా సీఎం కేసీఅర్ ఇక్కడి నుండి పోటీకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో నూతనోత్తేజం రాగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో మాత్రం నైరాశ్యం మొదలైంది. మొత్తానికి కామారెడ్డిలో రాజకీయం వేడెక్కింది.
Shabbir Ali About KCR Contesting in Kamareddy: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది అని ఆరోపించిన షబ్బీర్ అలీ... తండ్రి కేసీఆర్ లిక్కర్ షాపులు పెడితే, కూతురు కవిత ఆ లిక్కర్ దందాకి రాణి అయిందని ఎద్దేవా చేశారు.
Revanth Reddy Slams KCR : బీసీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే.. ఆ పదవిని బీసీకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారో ఆలోచించండన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 115 సీట్లలో ఒక్క ముదిరాజ్ కు కూడా టికెట్ ఇవ్వలేదు. ముదిరాజులపై కేసీఆర్ పగబట్టారు. 50 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు... అరశాతం ఉన్న కేసీఆర్ వర్గానికి 4 మంత్రి పదవులా? ఇచ్చారని ఆయన విమర్శించారు.
Revanth Reddy Comments On CM KCR: కొడంగల్లో మరోసారి కేసీఆర్ దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేగా కొడంగల్ ప్రజలకు ఎవరికీ లేదనకుండా సాయం చేశానని చెప్పారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే శవాలను వదలకుండా దోచుకునే రకం అని అన్నారు.
Mynampalli Hanmantha Rao Comments on Harish Rao: మైనంపల్లి హన్మంత రావు వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ తన ప్రెస్ మీట్లో స్పందిస్తూ.. " పార్టీలో ఉండాలి అనుకునే వారు ఉంటారు.. వద్దనుకునే వారు వెళ్లిపోతారు " అని అసహనం వ్యక్తంచేయడం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విమర్శలపై మైనంపల్లి హన్మంత రావు ఏం చేస్తారు, ఎలా స్పందిస్తారు అనేదే ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.
KTR and Kavitha: మంత్రి హరీశ్ రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు చేసిన ఘాటు వ్యాఖ్యలకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంతే ఘాటుగా స్పందించారు. మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి హన్మంత రావు వ్యాఖ్యలను ట్విటర్ ద్వారా ఖండిస్తూ వాళ్లు ఏమన్నారో చూడండి.
YS Sharmila Challenges KCR: గజ్వేల్ ఓటర్లు తన్ని తరిమేస్తారని దొరకు బాగా అర్థమైనట్టుంది. అందుకే ముందు జాగ్రత్తగా రెండో స్థానం నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎద్దేవా చేశారు.
Revanth Reddy Security Issue: అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారు. ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్లో రాస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టం అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Muthireddy Yadagiri Reddy vs Palla Rajeshwar Reddy: జనగాం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు మొదలైందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. జనగాం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి vs పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నట్టుగా జరుగుతున్న వివాదంలో తాజాగా మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.
ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యే అయ్యేందుకు ముప్పతిప్పలు పడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డిపై అనేక చోట్లా భూకబ్జాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జనగాంలో ముత్తిరెడ్డిపై వ్యతిరేకత ఉందన్న ప్రచారానికి తోడు తాజాగా అభ్యర్థుల జాబితాలోనూ ముత్తిరెడ్డి పేరు లేకపోవడం జనగంలో బీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ హీట్కి తావిచ్చింది.
Farmers Loans Waiver: రైతుల రుణ మాఫీకి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకి సోమవారం ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సోమవారం 9 లక్షల 2 వేల 843 మంది రైతులకు సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీని ఆఫర్లను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించే వృద్దులకు వృద్దులకు 50 శాతం రాయితీతో టికెట్లు ఇవ్వబోతున్నారు. ఆ వివరాలు..
మొదట్లో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. ఇపుడు మాత్రం విపరీతంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వీరి కోసం గాను.. మెట్రో సిబ్బంది ఒక సూపర్ ఆఫర్ ను ప్రకటించింది. అదేంటంటే కేవలం 59 రూపాయలతో రోజంతా మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ వివరాలు..
Gaddar Idol on Tankbund: ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహాన్ని స్థాపించాలి అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో ముద్రించాలన్న వైఎస్ షర్మిల.. గద్దర్ సొంత ఊరు తూప్రాన్ లో స్మారక భవనం నిర్మించి ఆయన స్పూర్తిని భవిష్యత్ తరాలకు పంచాలని అన్నారు.
Kavitha Absent for KTR's Nizamabad Meeting : ఇంతకాలం పాటు పెండింగ్లో పడుతూ పడుతూ వచ్చిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రారంభోత్సవాలకు మంచి ఊపు తీసుకొచ్చేలా కవిత చేసినప్పటికీ.. ఆమే ప్రారంభోత్సవాల్లో లేకపోవడం రాజకీయంగా చర్చకు తావిచ్చింది. ఇది బీఆరెస్లోనే కాదు ఇతర పార్టీల్లో కూడా చర్చకు వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.