Ponguleti Srinivas Reddy to join BJP: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. అధికారపార్టీ నేతలే టార్గెట్ గా మంత్రాంగం నడుపుతున్న ఈటల రాజేందర్ కు బడా లీడర్ చిక్కినట్లే కనిపిస్తుంది.
Azadi Ka Amrit Mahotsav: స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా ఆగస్టు 16న ఉదయం 11.30 గంటలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతా ఆలాపన చేయాలని తెలంగాణ సర్కారు నిన్నటి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Telangana: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5వేల అంగన్ వాడీ పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం.
Telangana: దేశ 75వ స్వాతంత్రోత్సవాల్ని తెలంగాణలో ఘనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఈ వేడుకల జరుగుతున్నాయి. కొందరు మహాత్ముడిని సైతం కించపర్చే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
CM KCR: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. 15 రోజుల పాటు జరిగే వేడుకలను మాదాపూర్ హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వజ్రోత్సవ వేడుకలను అద్భుతంగా నిర్వహించుకుందామని ఆ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో పేదరికం ఉన్నంతకాలం అలజడులు, అశాంతి ఉంటాయని.. పేదరికం పూర్తిగా తొలగిపోతేనే అభివృద్ధి సాధిస్తామని చెప్పారు.
Cm Kcr: రాష్ట్రంలో పది లక్షల మంది కొత్తోళ్లకు పంద్రాగస్టు నుంచి పెన్షన్లు ఇస్తున్నామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి 2016 రూపాయల పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు.
CM KCR: మోడీ సర్కార్ పై మరోసారి నిప్పులు చెరిగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నీతి ఆయగా నీతి లేని ఆయోగ్ గా మారిందని కేసీఆర్ ఫైరయ్యారు. రాష్ట్రాలను రావాల్సిన నిధులతు మోడీ సర్కార్ కోత పెడుతోందని ఆరోపించారు.
Neeti Ayog: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెలంగాణ, బీహార్ ముఖ్యమంత్రులు మినహా మిగితా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
నేతి బీరకాయలో నేతి ఎంతో నీతి ఆయోగ్‌లో నీతి అంత అని సీఎం కేసీఆర్ విమర్శించారు. నీతి ఆయోగ్ కేంద్రానికి భజన మండలిలా తయారైందని ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్రం పట్టించుకోనప్పుడు ఇక ఆ సంస్థకు ఉన్న విలువేంటని కేసీఆర్ ప్రశ్నించారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు విమర్శించారు. ఉద్యమకారుల్ని కొట్టినవారికే పదవులిచ్చారని ఆరోపించారు. ఉద్యమకారుల్ని కేసీఆర్ అన్యాయం చేశారన్నారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల పాటు 'స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ' వేడుకలు నిర్వహించనుంది. ఆగస్టు 8 నుంచి 22 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. వేడుకల్లో భాగంగా ప్రతీ ఇంటికి ఒకటి చొప్పున మొత్తం 1 కోటి 20 లక్షల గృహాలకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
Eetela Rajender: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత ఈటెల రాజేందర్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని మండిపడ్డారు. ఆ అవకాశం ఇప్పుడు నల్గొండ ప్రజలకు దక్కిందన్నారు.
Munugodu Byelections News Updates : రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబంపై యుద్ధం ప్రకటిస్తా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను ప్రకటించబోయే యుద్ధం రాజకీయ పార్టీల మధ్య యుద్ధం కాదని.. కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే చివరి యుద్ధం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
MLAs, MLCs stickers Issue: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే వాహనాల స్టిక్కర్లు ఇకపై దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తెలంగాణ సర్కారు ఓ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్టిక్కర్లు దుర్వినియోగం చేయడానికి వీల్లేకుండా పోనుంది. ఈ స్టిక్కర్లు కూడా గడువు తెలిసేలా ఉండటంతో పాటు ఎప్పటిలాగే హాలో మార్కుతో రానున్నాయి. కాకపోతే ఇందులో ఇంకొన్ని వివరాలు అదనంగా వచ్చి చేరనున్నాయి.
Eetala Rajender at VRAs strike: షామీర్పేట మండల కార్యాలయంలో నిరసన చేపట్టిన వీఆర్ఏలకు సంఘీభావం ప్రకటిస్తూ ఈటల రాజేందర్ ధర్నాలో బైఠాయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.