Maharashtra: లాక్డౌన్ ఆ రాష్ట్రంలో ఆశించిన ప్రయోజనాల్ని చేకూరుస్తోంది. అందుకే మరికొద్ది రోజులు లాక్డౌన్ పొడిగింపుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మే 31 వ తేదీ వరకూ లాక్డౌన్ పొడిగించారు.
COVID-19 tests in Telangana | హైదరాబాద్: తెలంగాణలో గురువారం కొత్తగా 352 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన కేసులలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 302 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ జిల్లాలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Exams amid lockdown | కరోనావైరస్ వ్యాప్తి నివారణకు కేంద్రం లాక్ డౌన్ విధించిన కారణంగా డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా ( Degree, PG exams postponed) పడిన సంగతి తెలిసిందే. వీళ్లతో పాటే బీటెక్, ఎంటెక్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు ? కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అసలు పరీక్షలు నిర్వహించడం సాధ్యపడుతుందా లేదా అనే సందేహాలు విద్యార్థులను అప్పటి నుంచే వేధిస్తున్నాయి.
How to fight against COVID-19 | లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటి ( మే 16 నుంచి ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. లాక్డౌన్ సడలింపుల ( Lockdown exemptions) అనంతరం కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏవీ జనం పాటించడం లేదని, మాస్కు ధరించడం, సోషల్ డిస్టన్సింగ్ పాటించడం వంటివి చేయకపోగా.. ఒక చోట గుంపుగా ఏర్పడటం లాంటివి చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారని జూన్ 13 నాటి హెల్త్ బులెటిన్‌లో సర్కార్ పేర్కొంది.
లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ( Lockdown extension ) కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus ) నివారించాలంటే కంటైన్మెంట్ జోన్లలో ( Containment zones ) కచ్చితంగా, కఠినంగా లాక్ డౌన్ పాటించాల్సిందేనని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. జూన్ 30 వరకు లాక్ డౌన్ 5.0 ( Lockdown5.0 ) అమలులో ఉండనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
కరోనావైరస్ నివారణ కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో నిన్న మే11న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
లాక్ డౌన్ ( Lockdown ) మే 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ( PM Modi`s video conference ) ద్వారా సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రాల్లో నెలకొన్ని పరిస్థితులు, చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ కొనసాగింపుపైనా ( Lockdown extension ) ప్రధాని మోదీ ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు గుర్తించిన ఆరు కేసులలో 5 జీహెచ్ఎంసీ పరిధిలోవి కాగా మరొకటి రంగారెడ్డి జిల్లా పరిధిలోనిది. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం.. శుక్రవారం నమోదైన ఆరు కరోనా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,044కు చేరుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తించకుండా నివారించడం కోసం కేంద్రం మరోసారి లాక్‌డౌన్‌ని మే 17వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మూడోసారి లాక్‌డౌన్‌ని పొడిగిస్తూ నేడు ఆదేశాలు జారీచేసిన కేంద్ర హోంశాఖ.. మే 17వ తేదీ వరకు అందుబాటులో ఉండే సేవల వివరాలు వెల్లడిస్తూ పలు మార్గదర్శకాలు సైతం జారీచేసింది.
మే 3తో ముగియనున్న లాక్ డౌన్ ను కేంద్రం మరో రెండు వారాలపాటు పొడిగించింది. తాజా ఆదేశాల ప్రకారం మే 17వ తేదీ వరకు భారత్ లో లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
లాక్డౌన్ ఉన్నన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) చేయడం బాగుంది కానీ లాక్ డౌన్ తర్వాత పరిస్థితేంటి ? కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇంట్లోంచి బయటికి వెళ్తే.. కరోనా నుంచి తప్పించుకోవడం ఎలా ? ప్రస్తుతం చాలామంది ఐటి ఉద్యోగులను వేధిస్తున్న ప్రశ్న ఇదే.
లాక్ డౌన్ పొడిగింపు కారణంగా మే 3వ తేదీ వరకు దేశంలో డొమెస్టిక్ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రధాని మోదీ ప్రకటించిన అనంతరం పౌరవిమానయాన శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. లాక్ డౌన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మే 3వ తేదీ వరకు పొడిగించడం వెనుక సరైన కారణాలే ఉన్నాయని.. అందుకే దేశంలో విమానాల రాకపోకలను సైతం నిలిపేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. మే 3 తర్వాత డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేయనున్నట్టు కేంద్ర
తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలు చాలా సహకరించారు. లాక్ డౌన్ కి సహకరించిన వాళ్లందరికీ తాను మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను.
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. వైరస్‌ను కట్టడి చేయాలంటే.. లాక్ డౌన్ ఒక్కటే తమ ముందున్న ఏకైక పరిష్కారం అని భావిస్తున్న ప్రభుత్వాలు.. కేంద్రం నుంచి లాక్ డౌన్ కొనసాగింపు విషయంలో ఇంకా ఓ స్పష్టత రాకముందే తామే సొంత నిర్ణయం తీసుకుంటున్నాయి.
కరోనా వైరస్ కారణంగా నిరుపేదలు పడుతున్న ఆకలి బాధలు అన్నీ ఇన్నీ కావు. పేదలకు, రోజువారి కూలీలు, యాచకులకు ఆహార ప్యాకెట్లు, రేషన్ తదితర వస్తువులను ఉచితంగా అందజేసే క్రమంలో కొంతమంది వారితో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా అనేకం కనిపిస్తున్నాయి.
లాక్ డౌన్‌ని మరో 15 రోజులు కొనసాగించే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి కేంద్రం ముందు పలు డిమాండ్స్ లేవనెత్తారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్‌ని ఇంకా కొనసాగించాలని భావిస్తే.. నిరుపేదల ఖాతాల్లో రూ.5 వేల చొప్పున జమ చేయాలని డిమాండ్ చేశారు.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ కొనసాగిస్తారా లేదా అనేదే ప్రస్తుతం యావత్ భారతీయుల మెదళ్లను తొలిచేస్తోన్న ప్రశ్న. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే లాక్ డౌన్ ఎత్తేసే పరిస్థితే కనిపించడం లేదు కానీ ఈ విషయంలో కేంద్రం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగామారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.