మహారాష్ట్ర గవర్నర్ అధికార నివాసమైన రాజ్భవన్లో దొంగలు హల్చల్ చేశారు. భవన పరిసరాల్లో గల అయిదు ఎర్రచందనం చెట్లను దుంగలుగా నరికి తీసుకెళ్లిపోయారు. అయితే అంతమంది సెక్యూరిటీ కళ్లు కప్పి ఈ పని ఎలా చేయగలిగారన్నది ఇప్పటికే అనేక అనుమానాలకు తావిస్తోంది.
మహారాష్ట్రలోని పుణేలోని సంగ్వీ చౌక్ వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. కారు అతి వేగంగా వచ్చి టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఆంధ్రప్రదేశ్లో ఒక స్థానానికి ఉప ఎన్నిక, మహారాష్ట్రలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల తేదీలను సోమవారం ప్రకటించింది
రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన సత్యం కుంభకోణం, జగన్ అక్రమాస్తుల కేసుల్లో దర్యాప్తు అధికారిగా చురుకైన పాత్ర పోషించిన ఐపీఎస్ ఆఫీసర్గా లక్ష్మీనారాయణ ప్రత్యేక గుర్తింపు పొందారు.
మహారాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, తమ రైతాంగ సమస్యలను ఒక కొలిక్కి తెచ్చేందుకు కొన్ని వేలమంది రైతులు రెండు రోజులుగా 180 కిలోమీటర్లు ప్రయాణించి మరీ నాసిక్ నుండి ముంబయి చేరుకున్న సంగతి తెలిసిందే.
గుజరాత్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ బీజేపీ నేత ఒకరు స్వయాన తమ పార్టీపైనే విమర్శలు కురిపించారు. ఈ ఎన్నికల ఫలితాల సమయంలో కాంగ్రెస్, బీజేపీకి గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
కేరళ, తమిళనాడు రాష్ట్రాలను అల్లకల్లోలం చేసి భీభత్సం సృష్టించిన 'ఓఖీ' తుఫాను దిశ మార్చుకుంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రభావం చూపనుంది. ఈ మేరకు జాతీయ వాతావరణ విభాగం (ఎంఐడీ) ఒక హెచ్చరిక జారీచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.