CM KCR may campaign on 27th for Huzurabad by election: హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ఈ నెల 30న ఉంది. అయితే ఈ నెల 27న ప్రచారం ముగియనుంది. కాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో లేదంటే నియోజకవర్గానికి సమీప ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ప్రచార సభ ఉండే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
Kadiyam Srihari comments on Dalita bandhu scheme: హైదరాబాద్: దళిత బంధు పథకంపై టీఆర్ఎస్ పార్టీ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకంను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతే ముందుగా నష్టపోయేది టీఆర్ఎస్ పార్టీనే అని కడియం శ్రీహరి కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
నందమూరి ఆశయాలకు విరుద్ధంగా ప్రస్తుతం టీడీపీ నడుస్తోందని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవాలన్న ఎన్టీఆర్ ఆలోచనతో సామాన్య దళిత కుటుంబానికి చెందిన తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. ఇటీవలి కాలంలో పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మోత్కుపల్లి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన అనంతరం ఏపీ సీఎం, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు.
తెలంగాణకు చెందిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇటీవలే వెంకయ్యనాయుడు స్పందిస్తూ మోత్కుపల్లి త్వరలోనే తీపికబురు వింటారని వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు గవర్నర్ గిరి ఖాయమనే విషయం స్పష్టమైంది. అయితే ఏ రాష్ట్రానికి కేటాయిస్తారు...ఎప్పుడు కేటాయిస్తారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.