Munugodu byelection : ప్రస్తుతం తెలంగాణ అంతా కూడా మునుగోడు వైపు చూస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అందరికీ తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక చర్చ మొదలైంది. మొత్తానికి నేడు ఈ ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
Telangana: తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. ప్రత్యర్ధి పార్టీనే కాకుండా అధికార పార్టీ మాటల్లో కూడా ఎన్నికల ప్రస్తావన రాకనే వస్తోంది. టీఆర్ఎస్ లెజిస్టేటివ్ పార్టీ సమావేశంలో ఇదే ప్రముఖంగా విన్పించింది.
మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. మునుగోడుకలో జరిగే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పాల్గొననున్నారు. అదే సభలో మునుగోడు అభ్యర్ధిని ప్రకటించే అవకాశాలున్నాయి.
Priyanka Gandhi: తమ సిట్టింగ్ స్థానమైన మునుగోడును తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. పార్టీలో అంతర్గత పోరుకు చెక్ పెట్టి..కేడర్ లో ఉత్సాహం నింపేందుకు చర్యలు చేపట్టింది.
Priyanka Gandhi: రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయింది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటల మధ్య అభ్యర్థి ఎంపికపై ఇంకా స్వష్టత రాలేదు.
మునుగోడు ఉప ఎన్నిక అసెంబ్లీ టికెట్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకు తలనొప్పిగా మారింది. ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కాకుండానే ఎవరికివారు టికెట్ తమదేనని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
Komatireddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొన్ని రోజులుగా ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా బుధవారం మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.