PM Narendra Modi Most Followed Active Politician On Twitter: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ నాయకుడిగా నిలిచారు. ట్విట్టర్లో అత్యధిక ఫాలోయర్లు ఉన్న యాక్టివ్ రాజకీయ నాయకులలో నరేంద్ర మోదీ అగ్రస్థానానికి వచ్చారు.
దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ (Coronavirus Vaccine) డ్రైవ్ ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కోవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాధవ్‌సింగ్ సోలంకి (94) కన్నుమూశారు. గుజరాత్ గాంధీనగర్‌లోని తన నివాసంలో సోలంకి (Madhav Singh Solanki ) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
శవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం కొనసాగుతోంది. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి అరికట్టేందుకు వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం దేశమంతటా కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.
భారత్‌లో కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ కరోనావైరస్ (COVID-19 Vaccine) వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) స్పందించారు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బూటా సింగ్ (Buta Singh) (86) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బూటా సింగ్ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
దేశవ్యాప్తంగా నూతన సంవత్సర (New year 2021) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశంలో మొట్టమొదటి డ్రైవర్ రహిత మెట్రో రైలును, విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్ లైన్లో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ సర్వీస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
రైతులకు భరోసా అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటాయి. అందులో భాగంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ యోజన. ప్రస్తుతం రైతులకు డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన నగదు ఆలస్యమైంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర వ్యవసాయ చట్టాలకు (Farm Laws) వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నెల రోజులుగా ఆందోళన (farmers protest) చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళనకు గురువారం కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది.
ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ రాజ్యాంగ హక్కులు అందే విధంగా దేశం ముందుకు వెళ్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మతాలకు అతీతంగా దేశం అభివృద్ధి వైపు పయనిస్తోందని మోదీ తెలిపారు.
One Nation One Election: తాజాగా మరోసారి జమిలి ఎన్నికల ప్రస్తావన తెరమీదకి వచ్చింది. అయితే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయా.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు అలాగే జరగనున్నాయా.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పందించారు.
కాంగ్రెస్ కురువృద్ధుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మోతీలాల్ ఓరా సోమవారం తుదిశ్వాస విడిచారు. 93 ఏళ్ల మోతీలాల్ ఓరా ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ (MP Ex CM Motilal Vora passes away) కన్నుమూశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని గురుద్వారా రాకబ్‌జంగ్ సాహిబ్ ( Gurudwara Shri Rakab Ganj Sahib) ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం ఉదయం గురుద్వారా రాకాబ్‌గంజ్‌కు చేరుకోని గురుతేజ్ బహదూర్‌కు నివాళులు అర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.