Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి స్వల్పంగా నమోదైంది. కొత్తగా 6,317 మంది వైరస్ బారిన పడగా.. కరోనా ధాటికి మరో 318 మంది మృతి చెందారు. కాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 215కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
Omicron Cases in India: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరింస్తుంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కేసులు దేశంలో 200 మార్క్ ను చేరాయి. దీంతో దేశంలోని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సంక్రమణ వేగం పుంజుకుంది. ప్రపంచమంతా వణికిస్తోంది. ఇటు ఇండియాలో కూడా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ సంక్రమణపై జినోమిక్స్ కన్సార్టియం ఏం చెబుతుందో పరిశీలిద్దాం.
Omicron cases: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కొత్తగా ఆరు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. కర్ణాటక, కేరళలోనూ కొత్త కేసులు నమోదయ్యాయి.
Omicron Cases in India: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వందకు(101) చేరినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మరోవైపు దేశంలోని 11 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించినట్లు మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు.
Omicron cases: ఢిల్లీలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో నలుగురిలో ఈ వేరియంట్ గుర్తించినట్లు ఢిల్లీ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Omicron in Noida: దేశంలో వరుస ఒమిక్రాన్ కేసులు (omicron cases in india) ప్రజల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. నోయిడాలో కొత్త మరో ఐదు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అవ్వడం వల్ల ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. వీరంతా యునైటెడ్ నేషన్, సింగపూర్ దేశాల నుంచి వచ్చిన వారు కొత్త వేరియంట్ బారిన (Omicron in Noida) పడినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Omicron in Surat: దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్తగా గుజరాత్ లోని సూరత్ లో తొలి ఒమిక్రాన్ కేసు బయటపడింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ టూరిస్టు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరింది.
Omicron case in Kerala: తిరువనంతపురం: కేరళలో ఆదివారం తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. యునైటెడ్ కింగ్డమ్ నుంచి కొచ్చికి వచ్చిన వ్యక్తికి ఈ కొత్త రకం వేరియంట్ సోకినట్టు కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ తెలిపారు.
Omicron variant:కరోనా ఒమిక్రాన్ వేరియంట్ భయాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. తాజాగా చండీగఢ్‌లో తొలికేసు నమోదైంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 35కు చేరింది.
Covid Cases in India: దేశంలోని కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 7,774 కొవిడ్ కేసులు నమోదవ్వగా.. 306 కరోనా మరణాలు సంభవించాయి. దాదాపుగా 8,464 మంది కరోనా వైరస్ నుంచి విముక్తి పొందారు.
Maharashtra: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోంది. శుక్రవారం మహారాష్ట్రలో 7 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రెండు రోజులపాటు 144 సెక్షన్ విధించారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కి చేరింది.
దేశంలో కరోనా ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గుజరాత్లో మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్ (Omicron cases in Gujarat) కేసులు బయటపడ్డాయి. గుజరాత్లో తొలుత ఒమిక్రాన్ సోకినట ఎన్ఆర్ఐని కలిసిన (ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించకముందు) మరో ఇద్దరు వ్యక్తులకు శక్రవారం పాజిటివ్‌గా తేలింది. దీనితో గుజరాత్లో ఒమిక్రాన్ కేసుల (Total Omicron cases in Gujarat) సంఖ్య మూడుకు చేరింది.
Corona Cases in India Today: ఒమిక్రాన్ వ్యాప్తి భయాందోళనల నేపథ్యంలో దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 8,439 మందికి వైరస్ సోకగా.. కొవిడ్ కారణంగా మరో 195 మంది ప్రాణాలు కోల్పోయారు.
Srikakulam: ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్ కు గురిచేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ఏపీలోకి ఎంటరైపోయిందా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా నుంచి శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
Omicron cases in Rajasthan : జైపూర్: ఒమిక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్ రాజస్థాన్ లోకి ప్రవేశించింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో 9 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. జెనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఈ ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్టు రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.