First Omicron variant Case in Chandigarh: దేశంలో కరోనా ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా చండీగఢ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు (First case of Omicron in Chandigarh) నమోదైంది. ఈ విషయాన్ని చండీగఢ్ ఆరోగ్య విభాగం అధికారికంగా ప్రకటించింది.
డిసెంబర్ 1న గుర్తింపు కానీ..
ఇటలీ నుంచి వచ్చిన 20 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిజానికి ఆ వ్యక్తి ఇటలి నుంచి నవంబర్ 22న ఇండియాకు వచ్చాడు. డిసెంబర్ 1న అతడికి ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొది ఆరోగ్య శాఖ. తాజాగా చేసిన పరీక్షల్లో అతనికి సోకింది ఒమిక్రాన్ వేరియంట్‌గా గుర్తించినట్లు తెలిపింది.
అయితే ఆ వ్యక్తి రెండు డోసులు ఫైజర్ టీకా (Pfizer vaccine) వేసుకున్నాడని.. అయినప్పటికీ పాజిటివ్‌గా తేలినట్లు వివరించింది ఆరోగ్య శాఖ.
మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. విదేశీల నుంచి వచ్చిన ఓ 35 వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వం (First Omicron case in AP) వెల్లడించింది.
తాజా కేసులతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 35కు (Total Omicron cases in India) చేరింది. ఇందులో మహారాష్ట్ర (17) తొలిస్థానంలో ఉండగా, రాజస్థాన్ (9) రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత గుజరాత్ (3), కర్ణాటక (2), ఢిల్లీ (2) ఉన్నాయి.
దేశంలో తగ్గుతున్న కొవిడ్ కేసులు..
ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తోంది. వరుసగా రెండో రోజూ 8 వేల దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 7,774 మందికి కొవిడ్ సోకినట్లు (Corona cases in India) కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. యాక్టివ్ కేసులు (Active corona cases in India) 92,281 వద్దకు చేరాయి.
Also read: Night Curfew: 'రాత్రి పూట కర్ఫ్యూని పరిశీలించండి.. కఠిన నిబంధనలు విధించండి'
Also read: Covid Cases in India: దేశంలో కొత్తగా 7,774 కొవిడ్ కేసులు, 306 మరణాలు.. 33 ఒమిక్రాన్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook