పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్..POKలో పాకిస్తాన్ మరోసారి నీచబుద్ధి ప్రదర్శించింది. ఇప్పటికే సహాయం పేరుతో సామాగ్రి పంపించిన పాకిస్తాన్ అధికారులు .. పీవోకేలోని స్థానిక దుకాణదారులకు వాటిని అమ్ముకున్నారు. అంతే కాదు సహాయ సామాగ్రి అవసరం ఉన్న వారు దుకాణదారుల నుంచి కొనుక్కోవాలని సూచించారు. ఈ ఘటన మరువక ముందే .. పాకిస్తాన్ నీచబుద్ధి మరోసారి బయటపడింది.
'కరోనా వైరస్'తో ప్రపంచం అంతా అల్లకల్లోలంగా మారుతోంది. కానీ పాకిస్తాన్ కు చీమకుట్టినట్లు కూడా కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ భారత్ పై నిత్యం యుద్ధ కాంక్షతో రగిలిపోతున్నట్లుగా కనిపిస్తోంది. భారత సరిహద్దు వెంబడి ఈ సమయంలోనూ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయంటే ఏమనుకోవాలి..?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్, పాకిస్థాన్‌లు టెస్ట్ సిరీస్ ఆడటానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరింత చొరవ చూపాలని, చురుకైన పాత్ర పోషించాలని పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ అన్నారు. రెండు దేశాలు ప్రభుత్వ స్థాయిలో పాకిస్తాన్, భారతదేశం
సరిహద్దుల్లో, యుద్ధంలో, దౌత్యంలో భారత్ ముందు చతికిలపడిన పాకిస్తాన్.. మన దేశాన్ని దెబ్బతీసేందుకు మరో కొత్త కుట్రకు తెరతీసింది. అదే టెర్రర్ ఫండింగ్.. అవును టెర్రర్ ఫండింగ్‌కి సంబంధించి మా జీ మీడియా వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉంది. ఇంతకీ పాకిస్తాన్ పన్నుతున్న కొత్త కుట్ర ఏంటి ? జీ మీడియా వద్ద ఉన్న ఆ ప్రత్యేకమైన సమాచారం ఏంటో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ వీడియో చూడాల్సిందే.
కశ్మీర్లో 2019, ఆగస్టు 5న ఆర్టికల్ 370 తొలగించిన సందర్భంలో కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవడం, పలు చోట్ల ఆందోళనకారులు చేపట్టిన నిరసనలు హింసకు దారితీయడం తెలిసిందే. అయితే, కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఇప్పటికే 7 నెలల పూర్తయింది. అక్కడ విధించిన పలు ఆంక్షలను సైతం కేంద్రం క్రమక్రమంగా ఎత్తివేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్లో పరిస్థితి ఎలా ఉంది ? ప్రస్తుత పరిస్థితిపై కశ్మీరీలు ఏమంటున్నారు ? ఆర్టికల్ 370 రద్దు తర్వాత వారి జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా ? ఆందోళనకారులు చెప్పినట్టుగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు మా జీ టీవీ
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్తనందించింది. భారత్ పాక్ ల మధ్య ఆసక్తికర పోరు దుబాయ్ లో జరగనుందని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. ఆసియా ఖండం స్థాయిలో అగ్రశ్రేణి
స్వాతంత్య్ర సంగ్రామం సమయంలో, ఇతర దేశాల్లో ఉన్న హిందువులను భారతదేశానికి తీసుకురావడంలో విఫలమైనందుకు దేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి తాజా వివాదానికి కారణమయ్యారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ఓ యువతి నినాదాలు చేయడం కలకలం రేపింది. ఆ సమయంలో అసదుద్దీన్ ఒవైసీ వేదికమీద ఉన్నారు.
రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల్లో భారత్ - పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలోని గ్రామాల రైతులను ఇప్పుడు మిడతలు వేధిస్తున్నాయి. పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దులు దాటుకుని భారీ సంఖ్యలో దేశంలోకి ప్రవేశిస్తోన్న మిడతలు అక్కడి వేలాది ఎకరాల్లోని పంట పొలాలపై దాడి చేసి నిమిషాల్లోని పంటలను పిండి చేస్తున్నాయి. నిమిషాల వ్యవధిలోనే పంటంతా నాశనం అవుతుండటంతో ఆ మిడతలను ఎలా పారదోలాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. పాకిస్తాన్ నుంచి ఎగిరొస్తున్న మిడతలు భారత్‌లోని రైతులను ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
దాయాది పాకిస్థాన్ హద్దులు మీరితే ఉపేక్షించేది లేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే అన్నారు. శాంతి ఒప్పందాలను అనుసరించి ఉంటున్నామని, అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
మాజీ అధ్యక్షుడు Pervez Musharraf దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ముగ్గురు న్యామూర్తుల ధర్మాసనం విచారించింది. ముషారఫ్‌పై నమోదైన దేశద్రోహం కేసు చట్టంలోని నిబంధనల ప్రకారం నమోదు కాలేదని గుర్తించింది.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలోని క్వెట్టాలో ఉన్న ఓ మసీదులో శుక్రవారం సాయంత్రం పేలుడు చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి సహా మొత్తం 15 మంది చనిపోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ప్రార్థనల సందర్భంగా పేలుడు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య కూడా అధికంగానే ఉంది.
పాక్ చెరలో ఉన్న భారత జాలర్ల విడుదల కోసం భారత విదేశాంగ ఇటీవల పాక్ విదేశాంగశాఖకు లేఖ రాసింది. జాలర్లను విడిచి పెట్టేందుకు నిర్ణయం తీసుకున్న పాక్ ఆ విషయాన్ని జనవరి 4న భారత అధికారులకు వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.