Pawan Kalyan Fan Letter: పవన్ కళ్యాణ్‌కు ఐర్లాండ్ నుంచి ఓ అభిమాని లేఖ రాశాడు. మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతామని.. రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడివి అంటూ జనసేనానిని గురించి రాసుకొచ్చాడు. ఈ లేఖకు పవన్ కళ్యాణ్ ఎమోషనల్ రిప్లై ఇచ్చారు.
Pawan Kalyan Letter to PM Modi: ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించాలని కోరారు. సీబీఐతో విచారణ చేయించాలన్నారు. లెక్కలతో జనసేనాని లేఖలో ప్రస్తావించారు.
Pawan Kalyan Review Meeting: వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెట్టారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అభ్యర్థులు వ్యక్తిగతం 10 వేల నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు.
Pawan Kalyan Public Meeting in Visakhapatnam: జనసేన పార్టీ విలీనంపై క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు టీడీపీతో పొత్తును విచ్చిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేస కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
Pawan Kalyan Slams CM Jagan: తాను కులాల గురించి ఎప్పుడు మాట్లాడినా.. విద్వేషాలు నింపేలా మాట్లాడనని అన్నారు పవన్ కళ్యాణ్. జగన్ అవినీతి గురించి ఎంత మాట్లాడినా ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఎవరు తినడం లేదని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని అన్నారు.
Pawan Kalyan Election Campaign: తెలంగాణ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ-జనసే అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. తనకు తెలంగాణ పునర్జన్మను ఇచ్చిందని.. రాష్ట్ర అభివృద్ధిక కట్టుబడి పనిచేస్తానని అన్నారు.
Pawan Kalyan In Independence Day Celebrations: జనసేన అధికారంలోకి వస్తే.. అక్రమాలు, అవినీతిపై సమాచారం అందించే వారికి గిఫ్ట్ స్కీమ్‌ను తీసుకువస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. జనసేన వీరమహిళతో సమావేశం అయ్యారు.
Pawan Kalyan On Volunteers: ఏపీలో వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్‌లా తయారయ్యారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇళ్లలోకి చొరబడి మరీ డేటాను సేకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థ నేడు ప్రాణాలను కూడా తీస్తోందని అన్నారు.
Pawan Kalyan Meeting with NRI Gulf Members: రాష్ట్రంలో అన్యాయం జరిగితే ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక తరం కోసం తన చివరి శ్వాస వరకు రాజకీయాల్లో పనిచేస్తానని చెప్పారు. ఎన్ఆర్ఐ గల్ఫ్ సభ్యులతో ఆయన సమావేశం అయ్యారు.
Ambati Rayudu On AP Volunteer System: రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి కారణం వాలంటీర్లేనంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు స్పందించారు. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారని.. పట్టించుకోవద్దని వాలంటీర్లకు సూచించారు.
Janasena-TDP Alliance: టీడీపీతో పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుపై ఆలోచించేందుకు ఇంకా సమయం ఉందని అన్నారు. ఇప్పటివరకు పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చిన పవన్.. తాజాగా ఇంకా సమయం ఉందని చెప్పడం చర్చనీయాంశమైంది.
Pawan Kalyan Varahi Yatra: తాను ఎన్నికల ముందు అది చేస్తా.. అన్నీ ఇచ్చేస్తా.. అని చెప్పనని తాను చేసేది మాత్రమే అన్నీ ఆలోచించి చెప్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తల తెగినా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. సినిమాలు వేరు.. రాజకీయం వేరు అన్న జనసేనాని.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి ఇలా అందరి హీరోలు అభిమానులు ఆలోచించి ఓట్లు వేయాలని రిక్వెస్ట్ చేశారు.
Pawan Kalyan Speech in Varahi Yatra: వచ్చే ఎన్నికల్లో తనను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవడూ ఆపలేడని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో తనను ఓడిపోయేలా చేశారని ఫైర్ అయ్యారు. కత్తిపూడిలో జనసేన నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
Pawan Kalyan Participates in Yagam: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ యాగం చేపట్టారు. సోమవారం ఉదయం మొదలైన ఈ యాగం మంగళవారం కూడా కొనసాగనుంది. పవన్ కళ్యాణ్ పట్టు వస్త్ర ధారణలో పాల్గొన్నారు.
Pawan Kalyan Slams AP Govt: రైతులకు మరింత అండగా ఉండాలనే ఉద్దేశంతో రాజమండ్రి కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం ఎకరాకు రూ.35 నుంచి రూ.40 వేలు పెట్టుబడి పెట్టినా అన్నదాతలకు గిట్టుబాధ ధర దక్కడం లేదని అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Pawan Kalyan On Alliance With TDP: తనను కాపుల చేత, దళితులు, మైనార్టీలతో తిట్టిస్తూ.. తెలివిగా మనలో మనకు గొడవలు పెడతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. కాపులు సంఘాలుగా విడిపోయాయని అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
Pawan Kalyan for Farmers: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డ 150 మంది రైతులకు రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.