Etela Rajender: తెలంగాణ బీజేపీలో ఈటెల రాజేందర్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. నిత్య ప్రజాక్షేత్రంలో ఉంటే కీలక పదవి దక్కొచ్చని ఆశపడుతున్నారు . హైడ్రా కూల్చివేతలను తీవ్రంగా నిరసిస్తున్న ఆ నేత.. ప్రజల కోసం రోడ్డు మీదకి వచ్చారు. సీఎం రేవంత్‌ను టార్గెట్ చేస్తే తనకు దక్కాల్సిన పదవి దక్కుతుందని ఆశపడుతున్నారా అంటే ఔననే అంటున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు.
Telangana New BJP chief: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా మరియు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే తెలంగాణకు నూతన అధ్యక్షుడు నియమించనున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వచ్చిన ఈటెలకు తెలంగాణ బిజెపి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. కానీ అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది.
Telangana BJP chief Etela: నేడు జరగబోయే కేంద్ర క్యాబినేట్ లో మల్కాజ్ గిరి నుంచి లోక్ సభకు ఎన్నికైన ఈటలకు స్థానం దక్కుతుందని అందరు భావించారు. అనూహ్యంగా ఈటలకు మంత్రి పదవి కాకుండా.. తెలంగాణ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
Telangana BJP Chief Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవడం సహజమని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తమ చేతుల్లో లేదన్నారు.
మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన విద్యాసాగర్ రావు.. పలు ఆసక్తికరమైన అంశాలను మీడియాతో పంచుకున్నారు.
దక్షిణాదిన కర్ణాటకలో తప్ప ఇంకే ఇతర రాష్ట్రంలోనూ పాగా వేయలేకపోతున్న బీజేపి... రానున్న కాలంలోనైనా అక్కడ బలమైన శక్తిగా ఎదగాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపి అధ్యక్షుల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో.. కొత్తగా నియమించబోయే అధ్యక్షుల ఎంపికకు సైతం పార్టీ అధిష్టానం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.