ఒక వర్గాన్నిలక్ష్యంగా చేసుకుని ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాతబస్తీ అట్టుడుకుతోంది. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. శాలిబండలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Amit Shah Ntr Meet: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వేళ ఎన్టీఆర్‌తో ఆయన భేటీ పలు ఊహాగానాలకు , చర్చలకు తెరలేపింది. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఆదివారం (ఆగస్టు 21) రాత్రి 10.30 గం. సమయంలో ఈ ఇద్దరి భేటీ జరిగింది. దాదాపు 50 నిమిషాల పాటు ఈ భేటీ జరగ్గా.. 20 నిమిషాల పాటు ఇద్దరు ఏకాంతంగా చర్చించుకున్నారు. భేటీ సందర్భంగా ఎన్టీఆర్ అమిత్ షాను మర్యాదపూర్వకంగా పుష్ప గుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి సత్కరించారు.
Amit Shah Ntr Meet: అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అనూహ్యంగా జరిగిన ఈ భేటీ వెనుక బీజేపీ వ్యూహమేంటనేది చర్చనీయాంశంగా మారింది.
Ponguleti Srinivas Reddy to join BJP: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. అధికారపార్టీ నేతలే టార్గెట్‌గా మంత్రాంగం నడుపుతున్న ఈటల రాజేందర్‌కు బడా లీడర్ చిక్కినట్లే కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై కొంతకాలంగా గుర్రుగా ఉన్న ఆ నేత బీజేపీ వైపు చూస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆ నేత మరెవరో కాదు.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే అనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Telangana BJP: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.త్వరలో మునుగోడు ఉప ఎన్నిక జరగనుండటంతో తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం జరిగింది.తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది.
Telangana BJP: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న సమయంలో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది.తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ గా సునీల్ బన్సల్ ను నియమించింది.
Bandi Sanjay Yatra: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి సాగనుంది. ఈసారి యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం నుంచి వరంగల్ భద్రకాళి వరకు ఆలయం వరకు యాత్ర సాగనుంది. పాదయాత్రలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగనున్నారు బండి సంజయ్.
Telangana Politics: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి కనిపిస్తోంది. జోరుగా నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార ,విపక్షాలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తమ పార్టీలో ఉన్న నేతలను కాపాడుకుంటూనే.. ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరేలా పావులు కదుపుతున్నాయి.
Komatireddy Rajagopal Reddy into BJP: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఎప్పుడు చేరుతారనే దానిపై ఆసక్తికర ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 2వ తేదీన యాదాద్రి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగస్టు 26న వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ముగియనుంది. బీజేపీ శ్రేణులు యాత్ర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Bandi Sanjay: తెలంగాణ సర్కార్ పై మరింత దూకడు పెంచింది బీజేపీ. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటూ కొంత కాలంగా ప్రకటనలు చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలనం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా ప్రయోగించారు.
Telangana Survey: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్షాలన్ని పోటాపోటీగా జనంలోకి వెళుతున్నాయి.సర్వేలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తమ బలాన్ని అంచనా వేసుకుంటున్నాయి పార్టీలు
Revanth Reddy: మొన్న టీఆర్ఎస్ సీనియర్ నేత నల్లాల ఓదేలు.. నిన్న గ్రేటర్ కార్పొరేటర్ విజయారెడ్డి.. నేడు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.. కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. గాంధీభవన్ కు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో సమీకరణలు పూర్తిగా మారిపోతున్నాయి
Komatireddy Meet Etela: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ హైకమాండ్ దూకుడుగా వెళుతోంది.అమిత్ షాతో ఈటల రాజేందర్ చర్చలు తెలంగాణలో ఆసక్తిగా మారగా.. తాజాగా ఢిల్లీలో జరిగిన మరో పరిణామం హాట్ హాట్ గా మారింది.
Etela Rajender: తెలంగాణలో అధికారమే బీజేపీ లక్ష్యమా? అమిత్ షా స్పెషల్ టీమ్ లు రంగంలోకి దిగాయా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లోనే కషాయ జెండా ఎగరాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు.. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.