Telangana BJP: మునుగోడు బైపోల్ వేళ బీజేపీ సంచలనం.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కు తీన్మారేనా?

Telangana BJP: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న సమయంలో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది.తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ గా సునీల్ బన్సల్ ను నియమించింది.

Written by - Srisailam | Last Updated : Aug 10, 2022, 07:19 PM IST
  • తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ గా సునీల్ బన్సల్
  • గతంలో యూపీలో పని చేసిన బన్సల్
  • అధికారమే లక్ష్యంగా బీజేపీ స్కెచ్
Telangana BJP: మునుగోడు బైపోల్ వేళ బీజేపీ సంచలనం.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కు తీన్మారేనా?

Telangana BJP:  తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న సమయంలో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది.తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ గా సునీల్ బన్సల్ ను నియమించింది. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా బాధ్యతలు సునీల్ బన్సల్ కు అప్పగించింది. బీజేపీలో హీరో టీమ్ లో ఒకరుగా ఉన్నారు సునీల్ బన్సల్. గతంలో ఉత్తర ప్రదేశ్ బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2017లో యూపీలో బీజేపీని గెలిపించిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఆ ఎన్నికల్లో యూపీలో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం పర్వం మొత్తం సునీల్ బన్సల్ పర్యవేక్షణలోనే జరిగింది. బూత్ స్ఠాయి నుంచి పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తారని బన్సల్ కు పేరుంది.  

మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీ తెలంగాణ ఇంచార్జ్‌ను మార్చడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఇటీవలే తెలంగాణ బీజేపీలో సంస్థాగత మార్పులు జరిగాయి. గత ఏడేళ్లుగా తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న మంత్రి శ్రీనివాస్‌ను పంజాబ్ కు పంపించింది.
తెలంగాణ బీజేపీ ఇంచార్జ్‌గా ప్రస్తుతం  తరుణ్ చుగ్  ఉన్నారు. ఆయన స్థానంలో సునీల్ బన్సల్‌ను నియమించింది బీజేపీ హైకమాండ్. తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసింది.వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసమ్మతి నేతలను గుర్తించి బీజేపీలో చేరేలా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది. చేరికల కమిటీ కన్వీనర్ గా ఉన్న ఈటల రాజేందర్ తనదైన శైలిలో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సునీల్ బన్సల్‌ అత్యంత సన్నిహితుడిని చెబుతారు. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్‌తో ఆయనకు అనుబంధం ఉంది. 1989లో రాజస్థాన్ యూనివర్శిటీకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఏబీవీపీలో పలు పదవులు నిర్వహించారు బన్సల్. ఏబీవీపీ జాతీయ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పని చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ సహా ఇంఛార్జ్‌గా పని చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో బీజేపీ అత్యధిక సీట్లు గెలవడంలో బన్సల్ పాత్ర కీలకమంటారు. అమిత్ షాకు నమ్మినబంటుగా ఉండే సునీల్ బన్సల్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంతో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయని తెలుస్తోంది.

Read also: ED TARGET KCR: హైద‌రాబాద్ ఈడీకి పవర్ ఫుల్ ఆఫీసర్.. సీఎం కేసీఆర్ కు బిగుస్తున్న ఈడీ ఉచ్చు! గులాబీలో గుబులు..

Read also: Munugode Byelection: మునుగోడు కాంగ్రెస్ లో టికెట్ లొల్లి.. రేవంత్ రెడ్డి ఛాయిస్ ఎవరో?

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News