Eatala Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. పాల్వంచ పర్యటనలో భాగంగా స్థానిక తెలంగాణ నగర్ వాసులతో మాట్లాడారు. అక్కడి ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడంపై కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Eatela Rajender: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంలో వరి ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు.
Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో సీఎం కూర్చికోసం నాలుగు స్తంబాల ఆట ప్రారంభమైందన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ మళ్లి అధికారంలోకి వచ్చే అకాశం లేదని జోస్యం చెప్పారు.
High tension in Bandi Sanjay Suryapet tour : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. టీఆర్ఎస్ శ్రేణులు ఆయన్ను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
BJP slams CM KCR over his Kukka remarks on women: నాగార్జున సాగర్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా.. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడానికి స్టేజీ వద్దకు వచ్చిన మహిళలపై సీఎం కేసీఆర్ దురుసుగా మాట్లాడటాన్ని బీజేపి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. నాగార్జున సాగర్ సభలో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలపైకి అక్కడే ఉన్న TRS party కార్యకర్తలను ఉసిగొల్పే విధంగా CM KCR వ్యవహరించారని బీజేపి నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో బీజేపీ రాష్ట్ర నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం జిల్లాలోని వైరాలో శనివారం బీజేపీ నేత నెలవెళ్లి రామారావు (BJP Leader Nelavelli Ramarao ) పై కత్తితో దాడి జరిగింది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. నిన్న బుధవారం విడుదల చేసిన మొదటి జాబితాలో 21 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. నేడు విడుదల చేసిన సెకండ్ లిస్టులో 18 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడించింది. బీజేపి సెకండ్ లిస్ట్ అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి.
#HyderabadLiberationDay | భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు నేడు. 1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రం రాగా, తెలంగాణ సహా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యానికి మాత్రం చీకటి రోజులు అలాగే ఉన్నాయి. తెలంగాణ విలీన దినోత్సవమా.. తెలంగాణ విమోచన దినోత్సవమా (Telangana Liberation Day) అనే వివాదం నేటికి కొనసాగుతోంది.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నేరం కింద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ( Bandi Sanjay ) నల్గొండ జిల్లా పెద్దవూర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెద్దవూర మండల పరిధిలోని బత్తాయి తోటలను పరిశీలించి రైతులను కలిసేందుకు వచ్చిన బండి సంజయ్... అక్కడే ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆయన వెంట బీజేపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డితో పాటు పార్టీకి చెందిన స్థానిక నేతలు కూడా ఉన్నారు.
తెలంగాణలో పురపాలక ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగించాయి. ప్రచారం గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించొద్దని సభలు సమావేశాలకు అనుమతి లేదని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సెల్ఫోన్లు, ఇంటర్నెట్, ఏ ఇతర సాంకేతిక సాధనాల ద్వారా ప్రచారం నిర్వహించొద్దని సూచించింది.
తెలంగాణ సర్కార్ టిఎస్ఆర్టీసీ(TSRTC)ని నిర్వీర్యం చేసిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శించారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసినట్లుగానే ఆ తర్వాత సింగరేణి(Singareni)ని కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని లక్ష్మణ్ ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.