Telangana Cabinet Meeting on 8th June:తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల రాక మొదలైంది. వర్షాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవడంపై చర్చించనున్నారు.
Free diagnostic tests in Telangana: హైదరాబాద్: తెలంగాణలో వైద్య సేవలు, వైద్య పరీక్షలు నిరుపేదలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్లను ప్రారంభించి ప్రజలకు డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నతాధికారులను ఆదేశించారు.
Etela Rajender Sensational Comments: సీఎం కేసీఆర్‌పై, రైతు బంధు సహా పలు అంశాలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
Digital survey on agricultural lands in Telangana: హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగానే ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను (Pilot digital survey of agricultural lands) చేపట్టాలన్నారు.
Former CS SV Prasad Passes Away: కొన్ని రోజుల కిందట ఎస్వీ ప్రసాద్ సహా ఆయన కుటుంబసభ్యులకు కరోనా సోకింది. భార్య, కుమారుడితో పాటు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో నేటి ఉదయం ఎస్వీ ప్రసాద్ తుదిశ్వాస విడిచారు.
KCR Responds On Junior Doctors Strike: సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మూడు సంవత్సరాల వైద్య విద్య అభ్యసించి కోవిడ్19 సేవలు అందిస్తున్న వైద్య విద్యార్థులకు కూడా సీనియర్ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనాన్ని అందించాలని నిర్ణయించారు.
Covid-19 Vaccination For Super Spreaders : తెలంగాణలో కరోనా పాజిటివిటి రేటుతో పాటు పాజిటివ్ కేసులు, మరణాలు స్వల్పంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా టీకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
Lockdown, COVID-19, black fungus, vaccination in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనాను కట్టడి చేసేందుకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు కరోనా పరీక్షలను పెంచడం ద్వారా కరోనాను కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, కొవిడ్-19 వాక్సిన్, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
COVID-19 tests in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపడానికే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కరోనా పరీక్షలు చేయడం లేదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి.. '' కరోనా వైరస్‌ను కట్టడి చేసే విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేశాయి'' అని మండి పడ్డారు.
Telangana govt to implement Ayushman Bharat Scheme: హైదరాబాద్: కేంద్రం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరనున్నట్లు తెలంగాణ సర్కార్ స్పష్టంచేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య శాఖతో ఎంవోయూ(MoU)పై సంతకాలు చేసింది.
Raghurama Krishnam Raju shifted to Hyderabad: హైదరాబాద్ : వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్ట్ వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుమతి, తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారం ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. అలాగే రఘురామరాజు తన సొంత పార్టీపైనే బహిరంగ విమర్శలు చేయడాన్ని సైతం నారాయణ తప్పుపట్టారు.
YS Sharmila slams Telangana CM KCR: హైదరాబాద్: కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చకపోవడాన్ని తప్పుపడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ ద్వారా సీఎం కేసీఆర్‌పై పలు వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైఎస్ షర్మిల.. ''అయ్య పెట్టడు అడుక్కు తిననియ్యడు. KCR కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడు.. కేంద్ర ఆయుష్మాన్ భారత్‌లో చేరరు'' అంటూ ముఖ్యమంత్రిపై సెటైర్లు వేశారు.
CM KCR's Health condition: హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా నుంచి కోలుకున్నారు. బుధవారం జరిపిన కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో ముఖ్యమంత్రికి నెగటివ్ అని నిర్ధారణ అయింది. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డా. ఎం.వి. రావు (MV Rao) ఆధ్వర్యంలో నిపుణుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు.
Free COVID-19 vaccine in Telangana: హైదరాబాద్: కరోనా కట్టడికి తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ కొవిడ్-19 వాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించుకున్న సీఎం కేసీఆర్... ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కి, వైద్యశాఖ అధికారులకూ ఆదేశాలు జారీ చేశారు.
KCR Health Status: కరోనా బారిన పడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన రేగుతోంది. స్వల్ప లక్షణాలతో ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్న కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
CM KCR's health condition latest updates: సీఎం కేసీఆర్‌కి కరోనా సోకినట్టు ఇవాళ జరిపిన కొవిడ్-19 పరీక్షల్లో నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ కరోనా బారిన పడిన నేపథ్యంలో ఆయనను ఫామ్‌హౌజ్‌లోనే ఐసోలేట్ కావాల్సిందిగా సూచించామని కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు (CM KCR's personal Dr MV Rao) తెలిపారు.
Telangana CM KCR health condition: హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి స్వల్ప లక్షణాలు (Mild symptoms of COVID-19) మాత్రమే ఉన్నందున ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు.
Telangana Examinations 2021: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. భారీగా కేసులు నమోదవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంది.
Ys jagan: రాష్ట్ర విభజన తరువాత ఉద్యోగుల్లో అధిక శాతం ఇబ్బందులకు గురయ్యారు. కుటుంబం ఓ చోట..ఉద్యోగం మరోచోట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంపై ఆ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Telangana Budget 2021 Live Updates | 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.2,30,825.96 కోట్లతో గురువారం ఉదయం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బడ్జెట్లో ఆయా శాఖలకు జరిగిన కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.