తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో కరోనావైరస్ (Coronavirus) కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24గంటల్లో 1,284 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( Telangana govt ) కళాశాలల విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల డ్రాపవుట్స్‌ను తగ్గించి, హాజరు శాతాన్ని పెంచేందుకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది.
IAS officials transfers: హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శాంతి కుమారిని అక్కడి నుంచి బదిలీ చేసి.. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై ప్రభుత్వానికి (Telangana Govt) మళ్లీ నిరాశ తప్పలేదు. భవనాల కూల్చివేతపై ఇంతకుముందు విధించిన స్టేను రేపటి వరకు పొడిగిస్తూ హైకోర్టు (Telangana High court) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలోని మునిసిపాలిటీల్లో ఖాళీల భర్తీపై పురపాలక శాఖ సన్నాహాలను ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని రేషనలైజ్ చేసిన తర్వాత పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామకాలను చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (KTR) పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ (coronavirus) పరీక్షలు చేయకపోవడంపై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న చికిత్సపై మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి మరోసారి అడ్డంకి ఎదురైంది. ఈనెల 13వ తేదీ వరకు భవనాల కూల్చివేతను ఆపాలన్న స్టేను మరోసారి పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
COVID-19 cases:హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు మొత్తం 11,062 కరోనా పరీక్షలు ( Coronavirus tests ) చేయగా.. 1,178 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 33,402 కి చేరుకుంది.
COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 1,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. నేడు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 762 కేసులు నమోదయ్యాయి. తాజాగా విడుదలైన కోవిడ్-19 హెల్త్ బులెటిన్ ( COVID-19 health bulletin ) ప్రకారం కరోనావైరస్ కారణంగా ఇవాళ ఎనిమిది మంది మృతి చెందారు.
వాస్తు పేరుతో 16 మంది ముఖ్యమంత్రులు పాలించిన సచివాలయాన్ని ఇప్పుడు కూల్చివేయడం దారుణమని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( CM K. Chandrashekar Rao) పై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. సచివాలయంలో ఉన్న నల్ల పోచమ్మ ఆలయం, మసీదును కూల్చి ఆయా వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన సీఎం, సీఎస్‌లను అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM K. Chandrashekar Rao) ఆరోగ్య పరిస్థితి గురించి గత కొన్ని రోజుల నుంచి అనేకచోట్ల పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతమంది యువకులు సీఎం కేసీఆర్ ఎక్కడంటూ ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. ఈ తరుణంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలపాలంటూ నవీన్ ( తీన్మార్ మల్లన్న ) జూలై 8న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు పిటిషనర్‌ను తీవ్రంగా మందలించింది.
హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించనున్న తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ఆలయం, మసీదులను ప్రభుత్వం (Telangana Govt) తరపున నిర్మించి సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) శుక్రవారం ప్రకటించారు.
COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో గురువారం కొత్తగా 1,410 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎప్పటిలాగే అందులోనూ జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే మొత్తం 918 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ హెల్త్ బులెటిన్ ( Health bulletin ) విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ (Coronavirus) రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. ఎప్పటిలాగానే హైదరాబాద్ నుంచే అత్యధిక కేసులు బయటపడటంతో ప్రజల భయాందోళన మరింత పెరిగింది.
హైదరాబాద్ : తెలంగాణలో మంగళవారం కొత్తగా 1879 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus cases ) నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,220 శ్యాంపిళ్లను పరీక్షించగా.. 1879 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రోజూలాగే ఇవాళ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ( GHMC ) అత్యధికంగా 1,422 కేసులు నమోదయ్యాయి.
విపత్కర పరిస్థితుల్లో తెలంగాణలో పలు ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తంచేసింది. కరోనావైరస్ చికిత్స, ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలపై న్యాయవాది కిషన్ శర్మ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలుచేశారు.
కరోనా వైరస్ ( Coronavirus ) వ్యాప్తిని నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం ( Telangana govt ) పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి (G. Kishan Reddy) ఆరోపించారు. కేంద్ర బృందం సలహాలు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, కరోనాతో హైదరాబాద్ ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. తెలంగాణ సచివాలయం (Telangana Secretariat) కూల్చాలని ప్రభుత్వ మంత్రి మండలి నిర్ణయించడం తెలిసిందే. అయితే మంత్రి మండలి వ్యక్తిగత నిర్ణయం కాదని, అవసరాల మేరకు తీసుకున్న నిర్ణయంగా హైకోర్టు భావించింది.
తెలంగాణలో ఆరో విడత హరితహారాని(Haritha Haram)కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జూన్ 25న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరో విడత హరితహారాన్ని నర్సాపూర్‌లో ప్రారంభించనున్నారు. భారీ మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.