తెలంగాణ సచివాలయం కూల్చివేతకు తొలగిన అడ్డంకులు

తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. తెలంగాణ సచివాలయం (Telangana Secretariat) కూల్చాలని ప్రభుత్వ మంత్రి మండలి నిర్ణయించడం తెలిసిందే. అయితే మంత్రి మండలి వ్యక్తిగత నిర్ణయం కాదని, అవసరాల మేరకు తీసుకున్న నిర్ణయంగా హైకోర్టు భావించింది.

Last Updated : Jun 29, 2020, 02:43 PM IST
తెలంగాణ సచివాలయం కూల్చివేతకు తొలగిన అడ్డంకులు

తెలంగాణ ప్రభుత్వానికి (Telangana govt) హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. తెలంగాణ సచివాలయం (Telangana Secretariat) కూల్చాలని ప్రభుత్వ మంత్రి మండలి నిర్ణయించడం తెలిసిందే. అయితే రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు (Congress Leaders), పలువురు వేసిన పిటీషన్లంటినీ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టివేసింది. తెలంగాణ మంత్రి మండలి నిర్ణయాన్ని తప్పుబట్టలేమని ఈ మేరకు కోర్టు తెలిపింది. దీంతో కొత్త సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్

ప్రస్తుతం ఉన్న సచివాలయం అవసరాలకు సరిపోవడం లేదని, దీనిపై జోక్యం అవసరం లేదని, ఇది విధానపరమైన నిర్ణయమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. అయితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు ప్రభుత్వం దీనిని తెరపైకి తెచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం ధర్మాసనం సోమవారం(జూన్ 29) నాడు ఈ తీర్పును వెల్లడించింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

Trending News