Telangana: కొవిడ్-19 కేసులపై లేటెస్ట్ బులెటిన్

COVID-19 cases:హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు మొత్తం 11,062 కరోనా పరీక్షలు ( Coronavirus tests ) చేయగా.. 1,178 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 33,402 కి చేరుకుంది.

Last Updated : Jul 11, 2020, 11:05 PM IST
Telangana: కొవిడ్-19 కేసులపై లేటెస్ట్ బులెటిన్

COVID-19 cases:హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు మొత్తం 11,062 కరోనా పరీక్షలు ( Coronavirus tests ) చేయగా.. 1,178 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 33,402 కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనాతో రాష్ట్రంలో 9 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 348కి చేరుకుంది ( COVID-19 deaths ). కరోనా నుంచి కోలుకుని ఇవాళ 1,714 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలా ఇప్పటివరకు మొత్తం 20,919 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

నేడు గుర్తించిన కరోనా కేసుల్లోనూ జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే అధిక సంఖ్యలో కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 736 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా రంగా రెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ జిల్లాలో 101, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 24 చొప్పున, వరంగల్ అర్బన్-20, మెదక్-16, సంగారెడ్డి-13, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 12 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. 

వీటితో పాటు సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 9 చొప్పున, ఆదిలాబాద్-8, సూర్యాపేట-7, గద్వాల్-6, నారాయణ్ పేట, మంచిర్యాల జిల్లాల్లో 5 చొప్పున, ఖమ్మం, వరంగల్ రూరల్, నిర్మల్, జగిత్యాల, జనగాం, వనపర్తి జిల్లాల్లో 2 చొప్పున కరోనా కేసులు ( Coronavirus cases ) నిర్దారణ అయ్యాయి.

Trending News