పది మంది ప్రాణాల్ని బలితీసుకున్న విజయవాడ స్వర్ణ ప్యాలేస్ కోవిడ్ సెంటర్ ( vijayawada swarna palace covid centre ) గురించి నిర్ఘాంతపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. విచారణ కమిటీ నివేదికలో అన్ని ఉల్లంఘనలు బయటపడ్డాయి. బహుశా అందుకే డాక్టర్ రమేష్ పరారీ ( Dr Ramesh ) లో ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు.
విజయవాడ కోవిడ్ సెంటర్ ( Vijayawada covid centre ) అగ్నిప్రమాద ఘటన విచారణకు అడ్డు తగిలితే నోటీసులు పంపిస్తామని హీరో రామ్ ( Hero Ram ) కు పోలీసులు హెచ్చరించారు. బాబాయ్ డాక్టర్ రమేష్ ను కాపాడేందుకు అసత్య ఆరోపణలు చేస్తే సహించమంటున్నారు.
విజయవాడ అగ్నిప్రమాద సంఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలకు దిగుతోంది. ఘటనకు బాధ్యులెవరో గుర్తించేందుకు విచారణ కమిటీ ఏర్పాటైంది. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఉందనేది ప్రాధమిక దర్యాప్తులో తేలినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
విజయవాడ కోవిడ్ 19 సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంపై దేశం మొత్తం ఉలిక్కిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ..ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అటు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్ లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.